పుష్పా.. ఈసారి గుడివాడలో క్యాసినో లేదా- కొడాలిని కెలుకుతున్న బుద్ధా వెంకన్న ..!

గతేడాది సంక్రాంతి సందర్భంగా కృష్ణాజిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాసినో జూదం ఎంత రచ్చకు కారణమైందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ క్యాసినో జూదం ఏర్పాటుకు కారణం స్ధానిక ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కొడాలి నాని అంటూ టీడీపీ నానా రచ్చ చేసింది. దీంతో కొడాలి నాని ఇరుకునపడ్డారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆ తర్వాత వివరణ ఇచ్చి బయటపడ్డారు. ఇప్పుడు టీడీపీ మరోసారి ఆ వ్యవహారాన్ని తెరపైకి తెస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మరోసారి గుడివాడలో వైసీపీ నేతలు క్యాసినో పోటీలు పెడతారా లేదా అనే దానిపై స్ధానికంగా చర్చ జరుగుతోంది. దీంతో ఇదే అదనుగా టీడీపీ నేత బుద్దా వెంకన్న మళ్లీ స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నానిని టార్గెట్ చేశారు. గుడివాడలో ఈసారి కూడా క్యాసినో పోటీలు పెడుతున్నారా లేదా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ కొడాలి నానిని ఉద్దేశించి బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన వాడిన సైటెర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

beard pushpa..no casino in gudivada this pongal ? budda venkanna teasing kodali nani

బుద్దా వెంకన్న తన ట్వీట్ లో కొడాలి నానిని గడ్డం పుష్ప (పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ గడ్డాన్ని గుర్తుచేస్తూ)గా అభివర్ణించారు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో ఉందా లేదా గడ్డం పుష్పా.. అంటూ కొడాలి నానిని బుద్దా వెంకన్నప్రశ్నించారు. అలాగే ఈ ట్వీట్ కింద గడ్డంగ్యాంగ్ క్యాసినో అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. తద్వారా గతేడాది క్యాసినో వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కొడాలిని టార్గెట్ చేసేందుకు బుద్దా వెంకన్న ప్రయత్నించారు. అయితే దీనిపై కొడాలి నాని మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+