బియాస్ విషాదం: మరో విద్యార్థి మృతదేహం గుర్తింపు
సిమ్లా/హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం మరో విద్యార్థి మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు.
ఈ మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌గా గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు బియాస్ నదిలో వెలికితీసిన మృతదేహాల సంఖ్య 20కి చేరింది. ఇంకా గల్లంతైన మరో నలుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా, బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరిసగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది.
మృతుల కుటుంబాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
జూన్ 8వ తేదీన విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications