Beauty tips: షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మెరిసే సౌందర్య రహస్యాలివే!!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలో సినీరంగ ప్రవేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆమె యాక్టింగ్ నేర్చుకోవడంతో పాటు, తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సుహానా ఖాన్ తన స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆమె స్టైల్ ను అనుసరించే అమ్మాయిలు చాలామంది ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.
సినిమాలలో తండ్రిలానే రాణించాలని భావిస్తున్న సుహానా ఖాన్ తన అందంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఎలాంటి మచ్చలు, మరకలు లేని కాంతివంతమైన చర్మంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సుహానా ఖాన్ తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు. ఆమె ప్రతి రోజూ తన బ్యూటీ ని మెయింటైన్ చేయడానికి ఫాలో అవుతున్న సీక్రెట్స్ ఏమిటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం .

సుహానా ఖాన్ తన అందాన్ని మెయింటైన్ చేయడానికి ముఖ్యంగా హైడ్రేషన్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటారు. రోజంతా శరీరానికి కావలసిన మొత్తంలో నీటిని తాగి చర్మం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకుంటారు. నీరు మాత్రమే కాకుండా ఆమె ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండే పండ్ల రసాలను, స్మూతీలను కూడా తాగుతూ ఉంటారు. బయట ఎండవేడిమి నుంచి తీవ్రత నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్స్ వాడుతారు.
మంచి సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల స్కిన్ ట్యాన్ కాకుండా ఉంటుంది. అంతేకాదు ముఖాన్ని కడుక్కోవడానికి సోప్ కాకుండా ఫేస్ వాష్ ను ఉపయోగిస్తారు. ఇక చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండాలి అని భావించి సుహానా ఖాన్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు.
భోజనంలో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేలా ఆహారాన్ని తీసుకుంటారు. ఇక ప్రతిరోజూ రెగ్యులర్ గా సుహానా ఖాన్ వ్యాయామం చేస్తారు. వ్యాయామంతో ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే కాదు పర్ఫెక్ట్ ఫిగర్ వస్తుందని ఆమె నమ్ముతారు. చర్మ సౌందర్యానికి కూడా వ్యాయామం ఎంతో అవసరమని సుహానా ఖాన్ భావిస్తారు. అందుకే నిత్యం వ్యాయామం చేయడానికి ప్రాధాన్యతనిస్తారు.












Click it and Unblock the Notifications