బెడ్ షీట్లు, టవల్స్ ఎత్తుకెళుతున్న రైల్వే ప్రయాణికులు!!
ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే ఏసీ కోచ్ లో ఉండే టవల్స్, బెడ్ షీట్లు, దిండ్లు అదృశ్యమవుతున్నాయని రైల్వే శాఖ తరుచుగా వాపోతుంటుంది. రైల్వే ఇచ్చిన బెడ్ షీట్లు, టవల్స్ ను ప్రయాణికులు ఇంటికి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇకనుంచి ఎవరైనా ప్రయాణికుడు అలా చేస్తే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. బెడ్ షీట్లు, టవల్స్ తీసుకుపోతుండటంవల్ల రైల్వేకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ప్రయాణికులు ఇలా చేయడంవల్ల ప్రతి ఏడాది రైల్వే శాఖకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. బెడ్‌షీట్‌లు, దుప్పట్లు, స్పూన్లు, కెటిల్స్, ట్యాప్‌లు, టాయిలెట్ బౌల్స్‌ను దొంగిలిస్తున్నారని, దీని వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు రైల్వే తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జోన్‌లోని రైళ్లల్లో ప్రయాణించేవారు వీటిని విపరీతంగా ఎత్తుకెళుతున్నారు. బిలాస్‌పూర్, దుర్గ్‌ల నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండు కవర్లు, ఫేస్ టవల్స్ చోరీకి గురవుతున్నట్లు గుర్తించారు. 4 నెలల్లో రూ. 55 లక్షల విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయని అధికారులు వెల్లడించారు. గత నాలుగు నెలల్లో రూ.55,97,406 విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.

12,886 ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.5,59,381. అదే సమయంలో ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 4 నెలల్లో 18,208 బెడ్‌షీట్లను చోరీ చేశారు. వీటి ధర దాదాపు రూ.28, 16, 231. 19,767 పిల్లో కవర్లు కూడా మాయమయ్యాయి. వాటి ధర రూ.10,14,837. అలాగే 2796 దుప్పట్లు (రూ.11,71,999), 312 దిండ్లు (రూ.34,956) ఎత్తుకెళ్లినట్లు తేలింది. రైల్వే వస్తువులను ఇలా దొంగిలించడంవల్ల 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రైల్వే ప్రాపర్టీ యాక్ట్ 1966 ప్రకారం అలాంటి ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దొరికిన ప్రయాణికులకు జరిమానాతో పాటు శిక్ష కూడా విధిస్తారు. ఇందులో గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది












Click it and Unblock the Notifications