'వచ్చేసారి పవన్ పోటీ చేయడం వెనుక కారణం ఇదీ!', పోలవరం పనుల్లో తెరవెనుక ఏం జరుగుతుంది.. వీర్రాజు

Recommended Video

    పవన్ పై నిప్పులు చెరిగిన ఎంపీ టీజీ వెంకటేష్

    అమరావతి/కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే భయంతోనే ఇవ్వడం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ బుధవారం కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.

    అందుకే రంగంలోకి పవన్ కళ్యాణ్

    అందుకే రంగంలోకి పవన్ కళ్యాణ్

    ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా దెబ్బతిన్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీల్చే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని టీజీ వెంకటేష్ చెప్పారు.

    తెరవెనుక ఏం జరిగిందో చెప్పండి: సోము వీర్రాజు

    తెరవెనుక ఏం జరిగిందో చెప్పండి: సోము వీర్రాజు

    చంద్రబాబు పాలనలో జనానికి ఒరిగింది ఏమీ లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. నీరు - చెట్టు పథకం ఖర్చుతో పదిహేను లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చునని చెప్పారు. 2014లో పోలవరంను చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదన్నారు. 2016 వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో తెరవెనుక ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. పోలవరం పనుల్లో తెరవెనుక చాలా జరిగిందన్నారు.

    బాబు హయాంలో భారీ అవినీతి

    బాబు హయాంలో భారీ అవినీతి

    వాంబే గృహాల్లో భారీ అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఇళ్ల పేరుతో 30వేల కోట్లకు పైగా దోచుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ డిపార్టుమెంటులో చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లేకుంటే చంద్రబాబు జీరో అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు.

    స్టీల్ ఫ్యాక్టరీ ఆందోళనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

    స్టీల్ ఫ్యాక్టరీ ఆందోళనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

    కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు అన్నారు. కేంద్రం ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు చెప్పడం దారుణం అన్నారు. కేంద్రం నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఆందోళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా సీఎం రమేష్ దీక్షను ఉద్దేశించి అన్నారు. దుగరాజుపట్నం ఓడరేవు విషయంలో షార్ అభ్యంతరాలపై రాష్ట్రం ప్రత్యామ్నాయ నివేదిక ఇవ్వలేదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+