ప్రముఖ పుణ్యకేత్రాలను కలుపుతూ.. తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు తన సేవలను అందించేందుకు సిద్ధమైంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే.. 'హరిద్వార్-ఋషికేష్-వైష్ణోదేవి- అమృతసర్- ఆనంద్‌పూర్ యాత్ర' భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది.
ఈ రైలు మానసా దేవి ఆలయం, హర్-కీ-పౌరీ వద్ద గంగా-హారతి, రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులా, ఆనంద్ సాహిబ్ గురుద్వారా, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్ (శ్రీ హర్మందిర్ సాహిబ్, శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్), వాఘా బోర్డర్ (సమయం అనుమతిస్తే) మొదలైన ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలను ఈ రైలు ప్రయాణంలో దర్శించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, తెలంగాణలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్‌నగర్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కే / దిగే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ యాత్ర మొత్తం 09 రాత్రులు / 10 రోజుల వ్యవధిలో కవర్ చేస్తుంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ - ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్ రెండూ), ప్రయాణం అంతటా వృత్తిపరమైన, స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌ల సేవలు, రైలులో భద్రత (సిసిటీవి కెమెరాలు) పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం, ప్రయాణ భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
పర్యటన ప్రారంభ తేదీ
23.04.2025 నుంచి 02.05.2025 వరకు (09 రాత్రులు/10 రోజులు)
ఎక్కే / దిగే సౌకర్యాన్ని కలిగిన స్టేషన్లు.. విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట , పెద్దపల్లి , మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ , బల్హర్షా , వార్ధా, నాగ్‌పూర్.
టూర్ ధర (ఒక్కొక్కరికి):
సేవలు ఎకానమీ స్టాండర్డ్ కంఫర్ట్
రైలు ప్రయాణ తరగతి స్లీపర్ 3ఏసీ 2ఏసీ డబుల్/ట్రిపుల్ షేర్ రూ. 18,510/-, రూ. 30,730/-, రూ. 40,685/-
చైల్డ్ (5-11 సంవత్సరాలు) రూ. 17,390 /- రూ. 29,420 /-రూ. 39,110 /-
ప్రయాణ ప్రణాళిక ప్రకారం బడ్జెట్ హోటళ్లలో రాత్రి బస నాన్-ఏసి గది, ఏసీ గది ఏసీ గది రవాణా సౌకర్యం.
ఈ యాత్ర బుకింగ్ కోసం ఆసక్తి గల ప్రయాణికులు ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ఐఆర్ సీటిసీ వెబ్‌సైట్:www.irctctourism.com సందర్శించవచ్చు లేదా కౌంటర్ బుకింగ్‌ల కోసం కింద ఉన్న కౌంటర్ నంబర్లను సంప్రదించవచ్చు: 040-27702407, 9701360701, 9281495845, 9281030750, 9281030740, 8287932228, 8287932229 నంబర్లలో సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications