జగన్ కు మరో భారీ షాక్, ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి సిద్దమైంది. రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ లీజుల వ్యవహారం పై కొంత కాలంగా వివాదం జరుగుతోంది. దీని పైన గనుల శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీనికి భారతీ యాజమాన్యం సమాధానం ఇస్తూ.. ఆ నిబంధనల పైన ప్రశ్నలు సంధించింది. షోకాజ్ నోటీసు వెనక్కు తీసుకోవాలని కోరింది. దీంతో.. ఆ వివరణ ను తోసిపుచ్చిన ప్రభుత్వం.. సున్నపురాయి లీజుల రద్దు దిశగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

భారతీ సిమెంట్స్ లీజు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అక్రమంగా లీజులు ఉన్నాయని.. ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందనగా.. ప్రభుత్వం చట్టపరమైన అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దుచేస్తారని భారతి సిమెంట్స్‌ ప్రశ్నిస్తోంది. జగన్‌ ప్రభుత్వ హయాం లో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని గుర్తు చేస్తూ.. అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని ప్రశ్నిస్తోంది.

bharati-cements-clarification-refused-by-the-govt-decided-to-cancel-the-illegal-mining-leases

లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులు ఇచ్చారని చెబుతూ... అలా చేయటం చట్టవిరుద్ధమైనదని పేర్కొంది. ఇది సహజ న్యాయసూత్రాలు, చట్టబద్ధ పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. లీజుల రద్దుకోసం చూపిస్తు న్న కారణాలు, నిబంధనలు తమకు వర్తించవని, తక్షణమే లీజుల రద్దు షోకాజ్‌ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. నోటీసుపై వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని గనులశాఖను కోరింది. అయితే, నోటీసు వెనక్కి తీసుకోవడం కుదరదని గనుల శాఖ తేల్చి చెప్పింది.

రద్దు దిశగా నిర్ణయం

అదే సమయంలో కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్‌) 1957లోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి) ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదే తప్పంటూ భారతి సిమెంట్స్‌ సరికొత్త వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ఆ కంపెనీ లీజులను రద్దుచేసేందుకు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో ఏసీసీ, రామ్‌కో సిమెంట్స్‌కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసేందుకు ఫైలు కదిలింది. 2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్‌ కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతి సిమెంట్స్‌కు 235.56 ఎకరాల మేర సున్నపురాయి లీజులను ఇచ్చారు.

లీజు కాలపరిమితి 50 ఏళ్లుగా ఖరారుచేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీచేశారు. ఇది చట్ట ఉల్లంఘనగా పేర్కొంటూ ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబరు 11న భారతి సిమెంట్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. భార తి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఈ నెల 5న వివరణ పంపించారు. పరిశీలన తరువాత ఎఎండీఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 10 (ఏ)(2)(సి)కి విరుద్ధంగా లీజులు పొందినందున వాటిని రద్దు చేయాలని గనులశాఖ డైరెక్టర్‌ సిఫారసు చేసినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+