నీలంసాహ్ని నిర్ణయాలకు జనాలు నవ్వుకుంటున్నారు .. పరిషత్ ఎన్నికలపై కోర్టు స్టే పై భూమా అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు . జగన్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ఎద్దేవా చేస్తున్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా పేర్కొన్నారు.

ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు

ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు

ఈ రోజు మీడియాతో మాట్లాడిన భూమా అఖిలప్రియ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారని, అందుకే కోర్టు స్టే ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నిర్ణయాలను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి పరిషత్ ఎన్నికల్లో పోటీ లో ఉండే విషయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్న భూమా అఖిలప్రియ చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు అంటూ తెలిపారు.

 వైసీపీ , పోలీసులు ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు ఆదరిస్తారు

వైసీపీ , పోలీసులు ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు ఆదరిస్తారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికల పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాలు చేయాలని ఏపీ ఎన్నికల కమిషనర్ హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల కోడ్ ఉండాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదనే కారణంతో ఏపీ హైకోర్టు ఎన్నికలపై స్టే విధించింది.

 పరిషత్ ఎన్నికలపై స్టే ఇచ్చిన హైకోర్టు , లంచ్ మోషన్ పిటీషన్ వెయ్యనున్న ఎస్ఈసి

పరిషత్ ఎన్నికలపై స్టే ఇచ్చిన హైకోర్టు , లంచ్ మోషన్ పిటీషన్ వెయ్యనున్న ఎస్ఈసి

తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో వైపు పరిషత్ ఎన్నికలపై హైకోర్టు నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు . చట్ట విరుద్ధమైన ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం సరైందని ఇప్పుడు హైకోర్టు తీర్పుతో రుజువైందని చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలను వెళ్లడాన్ని హైకోర్టు స్టే ఇచ్చి ఆపటం అంబేద్కర్‌ రాజ్యాంగ విజయమని చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+