చంద్రబాబు కోసం మోత మోగించిన భువనేశ్వరి; డమరుకంతో బ్రాహ్మణి; గంట కొట్టిన లోకేష్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు మద్దతుగా ఈరోజు మోత మోగిద్దాం అంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఏపీ దద్దరిల్లింది. చంద్రబాబు కోసం జనం మోత మోగించేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక శబ్దం చేయాలని, చంద్రబాబు కు తమ మద్దతును ప్రకటించాలని, గంటలు మోగించాలని, విజిల్స్ వేయాలని, ప్లేట్ల పై గరిటలతో కొట్టాలని, బైక్ పై వెళుతుంటే ఏడు గంటల సమయంలో హారన్ కొట్టాలని, తద్వారా చంద్రబాబుకు తమ మద్దతును తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా మోత మోగించే నిరసనకు పిలుపునిచ్చింది.

 bhuvaneshwari, brahmani

ఈ క్రమంలో ఏడు గంటల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దద్దరిల్లింది. మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి డ్రమ్ము పై కర్రలతో కొడుతూ మోత మోగించారు. చంద్రబాబుకు తన మద్దతును ప్రకటించడంతో పాటుగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తాడేపల్లి ప్యాలెస్లోని సైకో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా డ్రమ్స్ వాయించారు.


ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో గంట మోగించారు. నారా లోకేష్ తో పాటుగా రఘురామకృష్ణంరాజు ప్లేట్ పై గరిటతో కొడుతూ విజిల్ వేస్తూ మోత మోగించి తమ నిరసన తెలియజేశారు. టిడిపి ఎంపీలతో కలిసి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ జగన్ సర్కార్ తీరుపట్ల తమదైన నిరసన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా... మోత మోగిద్దాం కార్యక్రమంలో... ప్రజలతో కలిసి పాల్గొన్న నారా బ్రాహ్మణి డమరుకం మోగిస్తూ నిరసన తెలిపారు. బ్రాహ్మణి తో కలిసి మహిళలు బూరలు ఊదారు. మధ్యమధ్యలో విజిల్ వేస్తూ బ్రాహ్మణి మోత మోగించేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు, అభిమానులు మోత మోగించే కార్యక్రమంలో జోరుగా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+