Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ 175 సాధ్యమేనా ? అచ్చెన్నాయుడు 160 నేపథ్యం- మైండ్ గేమ్ మామూలుగా లేదుగా!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే రాజకీయాలు వేడెక్కాయి. జగన్ గేర్ మార్చాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులకు చేసిన సూచన, 175 సీట్లు కొట్టలేమా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై సొంత పార్టీ వైసీపీలోనే ఓ రేంజ్ లో చర్చ జరుగుతుండగా.. మిగతా పార్టీల్లో సైతం కలకలం రేగుతోంది. గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు తమకు 160 సీట్లు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే జగన్ 175 సీట్ల వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

 ఏపీలో పొలిటికల్ హీట్

ఏపీలో పొలిటికల్ హీట్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకూ పాలనపై దృష్టిపెట్టిన జగన్.. ఇకపై పార్టీపై దృష్టిపెట్టి ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టేశారు.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలు తమకు ప్రతికూలంగా మారకముందే అప్రమత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన పార్టీ శ్రేణులకు గేర్ మార్చాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రగిల్చే పనిలో బిజీగా కనిపిస్తున్నారు.

 జగన్ 175 సీట్ల వ్యాఖ్యలు

జగన్ 175 సీట్ల వ్యాఖ్యలు

నిన్న జరిగిన వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముఖ్యంగాఏపీలో 2019 ఎన్నిక్లలో సాధించిన 151 సీట్లను కాపాడుకోవాలని, అదే సమయంలో 175కు 175 సీట్లు సాధించలేమా అంటూ వైసీపీ నేతలకు ఆయన వేసిన ప్రశ్నతో వారంతా అవాక్కయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో క్షేత్రస్ధాయిలో ఉన్న పరిస్దితులు ప్రతికూలంగా మారుతున్నాయనే జనంలోకి వెళ్లి పాజిటివ్ ప్రచారం చేయాలని కోరుతున్న జగన్ 175 సీట్లూ గెల్చుకోలేమా అంటూ అడగడంపై వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది.

 అచ్చెన్నాయుడు 160 సీట్ల వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు 160 సీట్ల వ్యాఖ్యలు

గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో తాము 160 సీట్లు గెల్చుకోవడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన అప్పట్లో రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.

గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీ ఏ ధైర్యంతో 160 సీట్లు సాధిస్తామని చెప్పుకుంటోందన్న చర్చ సాగింది. దీనిపై వైసీపీ నేత సజ్జల కూడా స్పందించారు. టీడీపీ 160 సీట్లు సాధిస్తామని ఎలా చెబుతుందో అర్ధం కావడం లేదన్నారు. దీంతో వైసీపీలో సైతం ఈ వ్యాఖ్యలపై చర్చ జరిగినట్లు అర్ధమైంది. మిగతా పార్టీలు సరే సరి.

మైండ్ గేమ్ లో భాగమేనా?

మైండ్ గేమ్ లో భాగమేనా?

ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల ముందే జనంలోకి వెళ్లాలనుకోవడం, 160 సీట్లంటే 175 సీట్లని నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇదంతా మైండ్ గేమ్ లో భాగమేని ఇట్టే అర్ధమవుతోంది. లేకుంటే రాష్ట్రంలో వైసీపీ గత ఎన్నికల్లో సాధించిన 151 సీట్లే ఓ రికార్డు అయితే దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక మథనపడుతుంటే ఇప్పుడు 175 సీట్లంటూ జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది.

అదే సమయంలో వైసీపీపై పైచేయి సాధించడం అంటుంచి.. గట్టి పోటీ ఇస్తుందో లేదా తెలియని టీడీపీ 160 సీట్లు సాధిస్తామని చెప్పుకోవడం కూడా మైండ్ గేమ్ లో భాగంగానే కనిపిస్తోంది.

రాష్ట్రంలో వాస్తవ పరిస్దితులు చూస్తుంటే వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. అయితే అంతే వేగంగా దాన్ని సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ విఫలమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీగా సీట్లు కోల్పోయినా అధికారం నిలబెట్టుకుంటుందనే అంచనాలే ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+