అధికారం దక్కేదెవరికి - సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ విషయమే బిగ్ డిబేట్ గా మారింది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. విజయం పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఎన్నికల సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరంలోని చీపురుపల్లిలోనూ ఇలాంటి సెంటిమెంట్ కొనసాగుతోంది. దీంతో..అక్కడ గెలుపు పైన కొత్త అంచనాలు మొదలయ్యాయి.
హోరా హోరీ పోరు
ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఉత్తరాంధ్రలో విజయనగరంలో ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి అదే పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ తమ సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ ఆసక్తిగా మారుతోంది. ఇద్దరు రాజకీయ సీనియర్లు ఇక్కడ తలపడుతున్నారు. వైసీపీ నుంచి మంత్రి బొత్సా.. టీడీపీ నుంచి ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిచిన వారు ప్రభుత్వంలో మంత్రిగానూ అవకాశం దక్కించుకుంటారు.

గెలుపు దక్కేదెవరికి
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుండి 1999 ఎన్నికల వరకు వరుసగా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.కాగా, 1989 మినహా వరుసగా టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన 2004లో ఇక్కడ కాంగ్రెస్ నుండి బొత్స సత్యనారాయణ పోటీ చేసి గెలుపొందగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వ ఏర్పాటు చేసింది. 2014లో టీడీపీ నుండి కిమిడి మృణాళిని గెలుపొందగా, ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. బొత్స మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో..ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది కీలకంగా మారుతోంది.

సెంటిమెంట్ కొనసాగేనా
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బొత్సాకు తాను గెలవటంతో పాటుగా జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవటం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అదే సమయంలో టీడీపీలో చీపురుపల్లి పైన చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. ఇక్కడ సీటు ఆశించిన కిమిడి నాగార్జున పాత్ర పైన చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లా పైన ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. చీపురుపల్లిలో బొత్సా వర్సస్ కళా వెంకటరావు పోటీ పైన భిన్నమైన అంచనాలు ఉన్నాయి. దీంతో...ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తార.. తిరిగి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..ఇక్కడ గెలిచిన అభ్యర్ది తిరిగి మంత్రి అవుతారా లేదా అనే ఆసక్తి రాజకీయంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications