Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నలుగురి నేతలపై టీడీపీ గురి పెట్టింది. స్థానికంగా మారుతున్న రాజకీయ సమీకరణాల ఈ నలుగురి గెలుపు టీడీపీ, వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వీరి ఓటమి లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోసారి గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని నలుగురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గంలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గెలుపు పైన ఉత్కంఠ పెంచుతున్నాయి.

హోరా హోరీ పోరు
గుడివాడలో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. కొడాలి నానిని ఎలాగైనా ఈ సారి ఓడించాలనేది టీడీపీ ముఖ్య నాయకత్వం ఆలోచన. ఇందులో భాగంగా ఎన్నారై వెనిగళ్ల రామును బరిలోకి దింపింది. తన సేవా కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల ద్వారా గుడివాడలో రాము బలం పెంచుకొనేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇటు కొడాలి నాని మరోసారి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. కొడాలి నాని 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున గెలుపొందారు. 2012లో టిడిపిని వీడి వైసిపిలో చేరారు. 2014, 2019లో వైసిపి తరపున గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీ చేయనని..ఇదే చివరి ఎన్నికలని కొడాలి నాని చెబుతున్నారు.

Big Fight in Gudivada between Kodali Nani and Ramu becomes prestigious for both leaders

టీడీపీ గురి
చంద్రబాబు, లోకేష్ పైన పరుష పదజాలంతో నాని విరుచుకుపడటతో ఆయన టీడీపీకి టార్గెట్ అయ్యారు. నాలుగు పర్యయాలు గెలిచిన నేతగా గడివాడలో నానికి మంచి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లోనూ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర సమయంలో తన నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. జగన్ విధేయుడిగా నానికి పేరుంది. 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసిన దేవినేని అవినాశ్ ప్రస్తుతం వైసీపీ నుంచి విజయవాడ తూర్పు అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నలుగురి నేతల గెలుపు పైన ఆసక్తి కొనసాగుతోంది. విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీలో ఉన్నారు.

Big Fight in Gudivada between Kodali Nani and Ramu becomes prestigious for both leaders

గెలుపు దక్కేదెవరికి
విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాశ్, ఎంపీగా కేశినేని నాని, గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలుపు పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది. ఈ నలుగురి పైనా టీడీపీ ప్రత్యేకంగా గురి పెట్టటంతో జగన్ సైతం తన మార్క్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని నాని వర్సస్ చిన్నిగా వార్ మారింది. ప్రచారంలో రెండు పార్టీల నేతలు ఇక్కడ దూసుకువెళ్తున్నారు. జగన్ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల యాత్రకు మంచి స్పందన వచ్చింది. దీంతో..ఈ నలుగురి ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+