జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
ఏపీలో విజయం దక్కేదెవరికి. గోదావరి జిల్లాల్లో ఎవరికి మెజార్టీ సీట్లు వస్తే వారిదే అధికారం. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానీయమని పవన్ శపథం చేసారు. అక్కడ మూడు పార్టీల కూటమి మెజార్టీ సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పవన్ పోటీ చేసే స్థానాలు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. పిఠాపురం నుంచే పవన్ పోటీ చేస్తున్నారు. ప్రధానంగా కాకినాడ పార్లమెంరటీ స్థానం..పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో గెలుపు సీఎం జగన్..పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.
మారుతున్న లెక్కలు
కాకినాడ పార్లమెంటరీ పరిధిలో ఈ సారి సామాజిక సమీకరణాలు ప్రధానంగా గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. కాపు ఓటింగ్ జనసేన వైపు ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ముద్రగడ వైసీపీ నుంచి ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ఎంపీ స్థానంలో వైసీపీ వర్సస్ జనసేనగా మారింది. అక్కడ కాంగ్రెస్ నుంచి పల్లంరాజు పోటీకి దిగటం తో పోరు మరింత ఆసక్తి కరంగా మారింది. త ఎన్నికల్లో ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాలను వైసిపి కైవశం చేసుకుంది. పెద్దాపురంలో మాత్రమే టిడిపి గెలిచింది. ఎంపీ అభ్యర్దిగా వైసిపి నుంచి చలమలశెట్టి సునీల్ పోటీలో ఉన్నారు. ఈయన గత మూడుసార్లు మూడు పార్టీల నుంచి ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన నేత తంగేళ్ల ఉదరు శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

వ్యూహాత్మక ఎంపిక
ఎన్నికల బరిలోకి దిగడం కొత్త, యువతకు తప్ప మిగిలిన వర్గాలకు దగ్గర కాలేకపోవడం ప్రతికూల అంశం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజును ఆ పార్టీ అధిష్టానం ఇటీవలే ప్రకటించింది. ఆయన మూడుసార్లు ఎంపిగా నెగ్గి, రెండుసార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. సౌమ్యుడుగా, అభివృద్ధి ప్రదాతగా పేరు ఉంది. పార్లమెంటు పరిధిలో బంధు వర్గం కూడా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్ గెలుపు అంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసిపి నుంచి ఎంపి వంగా గీత పిఠాపురం పోటీ చేస్తున్నారు. వైసీపీ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది.
కలిసొచ్చేదెవరికి
ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసిపి నుంచి బరిలో ఉన్నారు. టిడిపి నుంచి సమీప బంధువైన వరుపుల రాజా భార్య సత్యప్రభ పోటీ చేస్తున్నారు. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం వైసిపి నుంచి పోటీలో నిలవగా, కూటమి అభ్యర్థిగా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ బరిలో ఉన్నారు. గ్రూపు తగాదాలు తోటకు తలపోటుగా మారాయి. సిట్టింగు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం తోట నరసింహంకు పూర్తిగా సహకరించని పరిస్థితి నెలకొంది. పెద్దాపురంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దవులూరి దొరబాబు వైసిపి నుంచి బరిలో ఉన్నారు. కాకినాడ సిటీ ,కాకినాడ రూరల్, తునిలోనూ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో..కాకినాడ జిల్లాలో జగన్ - పవన్ ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications