వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా తో జూ ఎన్టీఆర్ భేటీ - విందు రాజకీయం : టీడీపీలో కలకలం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్. టీడీపీలో కలకలం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్. మునుగోడులో సభలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా తో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నారు. బీజేపీ నేతలు ఈ మేరకు అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఖారారు చేసారు. ఈ రాత్రికి ఒక ప్రముఖ హోటలో అమిత్ షాతో జూనియర్ ను విందుకు ఆహ్వానించారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఈ ఆహ్వానాన్ని నిర్దారించారు. ఇక వైపు బీజేపీతో దూరమైన టీడీపీ తిరిగి పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోంది.

అమిత్ షా తో భేటీ వెనుక

అమిత్ షా తో భేటీ వెనుక

ఇదే సమయంలో బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే విషయం లో తమ అభిప్రాయం స్పష్టం చేయటం లేదు. ఈ సమయంలోనే టీడీపీ..రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమిత్ షా తో కలిసి విందులో పాల్గొనటం రాజకీయంగా ప్రకంపనాలకు కారణమవుతోంది.

అటు ఏపీలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ..ఇటు నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పుడు నేరుగా అమిత్ షా భేటీ కావటం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి అమిత్ షా తారక్ తో సమావేశం కావాలని నిర్ణయించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

వ్యహాత్మక భేటీ అంటూ ప్రచారం

వ్యహాత్మక భేటీ అంటూ ప్రచారం


అయితే, రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా ముందస్తు రాజకీయ స్ట్రాటజీల్లో భాగంగానే.. తారక్ తో సమావేశం అవుతున్నారనే చర్చ సాగుతోంది. అయితే, ఇప్పుడు ఇది ప్రధానంగా టీడీపీ నేతల్లో చర్చకు కారణమవుతోంది. తాను పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసానని జూ ఎన్టీఆర్ కొంత కాలంగా చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీ..ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

తారక్ బీజేపీకి దగ్గరవ్వటం సాధ్యమేనా

తారక్ బీజేపీకి దగ్గరవ్వటం సాధ్యమేనా


అయితే, తన తాత స్థాపించిన పార్టీ కోసం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటానని గతంలో జూనియర్ చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత టీడీపీ రాజకీయాల్లో దూరం పాటిస్తున్నారు. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొన లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మేనత్త పురంధేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో..ఇప్పుడు అమిత్ షా స్వయంగా జూనియర్ ను ఆహ్వానించాలని సూచించటం..కలిసి విందుకు నిర్ణయించటం ద్వారా ఇది కేవలం అభిమానంతో జరుగుతున్న సమావేశమా.. లేక, బీజేపీ భవిష్యత్ రాజకీయాల్లో తారక్ కీలకం కాబోతున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Union Home Minister Amit Shah invited Junior NTR for Dinner in Hyderabad, it lead to new debate in AP Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X