వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో థియేటర్లకు ఊరట-ఫైన్లు కట్టి తెరుచుకోవచ్చన్న సర్కార్-లైసెన్స్ లకు నెల డెడ్ లైన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల విషయంలో ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లతో సమావేశం సందర్భంగా ఇచ్చిన ఓ కీలకమైన హామీని అమల్లోకి తెచ్చింది. దీంతో ఈ మధ్య మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే వాటి లైసెన్స్ రెన్యువల్ గడువు కూడా పొడిగించారు. దీంతో వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న టాలీవుడ్ కు ఇదో ఊరట కానుంది.

థియేటర్లలో తనిఖీలు

థియేటర్లలో తనిఖీలు

ఏపీలో సినిమా థియేటర్లపై ప్రభుత్వం తాజాగా కొరడా ఝళిపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయని థియేటర్లలో తనిఖీలు నిర్వహించడంతో పాటు పలు చర్యలు కూడా తీసుకుంది. టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నా, క్యాంటీన్లలో రేట్లు పెంచినా, లైసెన్స్ లు లేకున్నా చర్యలకు దిగింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలతో పాటు డిస్టిబ్యూటర్లు బెంబెలేత్తారు. ప్రభుత్వం వద్దకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని వారితో చర్చలు జరిపారు.

తెరుచుకోనున్న థియేటర్లు

తెరుచుకోనున్న థియేటర్లు

తాజాగా రెవెన్యూ, పోలీసు అధికారులు జరిపిన దాడుల్లో ప్రభుత్వం దాదాపు 130 ధియేటర్లపై వివిధ చర్యలు తీసుకుంది. ఇందులో జరిమానాలు విధింపుతో పాటు థియేటర్లను సీజ్ కూడా ఉంది. ఇలా 9 జిల్లాల్లో 83 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఇవాళ వాటిని తిరిగి తెరిచేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా థియేటర్లన్నీ తిరిగి తెరిచేందుకు వీలుగా అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకోనందుకు ప్రభుత్వం విధించే జరిమానాలు కట్టి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.

నెల రోజుల డెడ్ లైన్

నెల రోజుల డెడ్ లైన్


రాష్ట్రంలో థియేటర్ల లైసెన్స్ ల రెన్యువల్ కు ప్రభుత్వం గతంలో మూడు నెలల గడువు ఇచ్చింది. అయినా పలు చోట్ల థియేటర్లు తమ లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం వీటిపై కొరడా ఝళిపించింది. ఆయా థియేటర్లను సీజ్ చేయాలని అదేశాలు ఇచ్చింది. ఇలా మూతపడిన థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేసుకునేందుకు కూడా నెల రోజుల వ్యవధి ఇచ్చింది. ఈ సమయంలో వారు కచ్చితంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది.

English summary
ap government has orders to release seized theatres in the state and extend time to renewal their licences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X