బోరుగడ్డ వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్-కూటమి సర్కార్ కు షాక్..!
వైసీపీ సానుభూతిపరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు భారీ ఊరట దక్కింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పలు కేసులు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ బెయిల్ వ్యవహారంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఫేక్ సర్టిఫికెట్ పెట్టి గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను పొడిగించుకున్నారనే అభియోగాల్ని ఎదుర్కొంటున్న ఆయనకు అనూహ్యంగా మరో రూటులో ఊరట లభించింది.
బోరుగడ్డ అనిల్ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ గతంలో హైకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. అనంతరం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగింపు కోరారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. అదే సమయంలో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ ను విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా ఆయనకు ఊరట దక్కలేదు.

గతంలో ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ కు ఈ వ్యవహారం తేలకముందే రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం కోర్టులో బోరుగడ్డ అనిల్ కు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి కీలక తీర్పు ప్రకటించారు. అదీ 90 రోజుల గడువులోకా ఛార్జిషీట్ వేయలేదనే కారణంతో ఆయనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారు.
అనంతపురం కోర్టులో పీపీ ఈశ్వరమ్మ సకాలంలో ఛార్ఝిషీట్ దాఖలు చేయకపోవడంతో బోరుగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే వైసీపీ హయాంలో నియమించిన పీపీ ఈశ్వరమ్మ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగానే అనంతపురంలో కోర్టులో బోరుగడ్డకు బెయిల్ లభించిన వ్యవహారం ప్రభుత్వానికి షాకిచ్చింది.












Click it and Unblock the Notifications