Chandrababu: ఎన్నికల వేళ చంద్రబాబుకు భారీ ఊరట- సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిల్ పొందిన విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఓవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ఆయన బెయిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఇది భారీ ఊరటగా మారుతోంది.

గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్టు తర్వాత 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దీన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే చంద్రబాబు అప్పటికే తనను సెక్షన్ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం కుదరదంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినా తీర్పు రాలేదు.
ఈ నేపథ్యంలో సెక్షన్ 17ఏ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రింకోర్టులో విచారణ పూర్తయ్యాక ఆయన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. దీంతో 10 వారాల పాటు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున ఆ తర్వాతే దీనిపై ఇతర వాదనలు వింటామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. దీంతో సీఐడీ న్యాయవాది కూడా వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ముందు ప్రస్తావిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications