పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్- బెయిల్ సహా 17 కేసుల్లో ఊరట..!
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఇవాళ భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 17 కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయన బెయిల్ పొందగా.. మరో రెండు కేసుల్లో ఇవాళ ఆదోని, విజయవాడ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఇతర కేసుల్లో హైకోర్టు ఊరటనిచ్చింది.
సోమవారం నరసరావుపేట కోర్టు, రాజంపేట కోర్టు పోసాని కృష్ణమురళికి ముందస్తు బెయిల్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆదోని, విజయవాడ కోర్టులు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. అదే సమయంలో పోసానిని ఒకే ఆరోపణపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి వివిధ ప్రాంతాలకు తిప్పడం, 67 ఏళ్ల వయసు, అనారోగ్య పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

పోసానికి ఇప్పటికే బెయిల్ లభించిన కేసుల్ని వదిలిపెట్టి మిగతా కేసుల్లో ఆయనకు 35ఏ నోటీసు జారీ చేసి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విశాఖపట్నం వన్ టౌన్‌లో దాఖలైన కేసులో దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పోసానికి వివిధ ప్రాంతాల్లో నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ ఊరట దక్కినట్లయింది. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో పోసాని కృష్ణమురళి బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలపై బూతులతో రెచ్చిపోయిన పోసాని కృష్ణమురళిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేయించి పోలీసులతో వివిధ ఆయా ప్రాంతాలకు తిప్పుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టుతో పాటు ఆదోని, విజయవాడ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications