ఏపీలో టీచర్లకు బిగ్ రిలీఫ్-లోకేష్ కీలక ఆదేశాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్లకు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాదు వాటిని వెంటనే అమల్లో కూడా పెట్టేస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో స్కూళ్లలో బాత్ రూమ్ ల ఫొటోలు తీసి మొబైల్ లో అప్ లోడ్ చేసే కార్యక్రమానికి చరమగీతం పాడారు. ఇప్పుడు అంతకంటే పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా పాఠశాల విద్య, సమగ్ర శిక్ష అభియాన్ పై జరిపిన సమీక్షలో విద్యామంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్లు వాడుతున్న 45 యాప్ లను తొలగించాలని లోకేష్ ఆదేశించారు. వీటి స్ధానంలో కేవలం ఒక్క యాప్ మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. టీచర్లపై ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని తగ్గించి వారు పూర్తిగా బోధనపై దృష్టిపెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులకు లోకేష్ తెలిపారు.

అలాగే పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విషయాల్ని ఏకీకృతం చేసి ఒక డ్యాష్ బోర్డుపై వచ్చేలా చూడాలని అధికారుల్ని మంత్రి లోకేష్ కోరారు. ఇందులో క్షేత్రస్దాయి నుంచి మంత్రి స్థాయి వరకూ ఎవరికి వారు తమ లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అదేశించారు. మరోవైపు స్కూళ్ల అభివృద్ధికి వాటిలో గతంలో చదివిన విద్యార్ధుల నుంచి సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారికి ఆయా స్కూళ్ల అవసరాలు తెలియచేసి, ముందుకు వచ్చే వారిని వాటికి మెంటార్లుగా నియమించేలా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. తద్వారా ఆయా స్కూళ్ల అవసరాల్ని తెలుసుకుని వారే తీర్చే అవకాశం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications