వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

వైసీపీ రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో చోటు చేసుకుందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మిథున్ రెడ్డికి ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.

మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఈ పిటిషన్ లో ఆధారాల్ని సమగ్రంగా పరిశీలించలేదని ఆభిప్రాయపడింది. దీంతో మరోసారి తాజాగా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది.

big relief to ysrcp mp pv mithun reddy as sc order not to arrest ask hc for fresh hearing on bail

అంతే కాదు ఈ కేసులో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా ఏపీ పోలీసుల్ని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్ మిథున్ రెడ్డి నేరుగా లింక్ ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొంది. అరెస్టు అనేది సమంజసమైన, హేతుబద్దమైన కారణాలతోనే చేయాలని తెలిపింది. పోలీసులు ఓ కేసు నమోదు కాగానే యాంత్రికంగా అరెస్టులు చేయడం సరికాదని వెల్లడించింది. తగిన కారణం ఉంటేనే అరెస్టు చేయాలని అభిప్రాయపడింది.

ఇలాంటి కేసు్లో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడి గౌరవాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కాబట్టి హైకోర్టు ఈ కేసులో మరోసారి సమగ్రంగా విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టులో మరోసారి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+