చంద్రబాబుకు భారీ షాక్- సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కరెక్టేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లయింది.

 cbnjagansupream

అమరావతి భూకుంభకోణంతో పాటు ఇతర చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిట్ ఏర్పాటు చేసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా దర్యాప్తు నిర్వహించింది. దీని సిఫార్సుల ఆధారంగా సిట్ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు దీనిపై హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీన్ని వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది.

 supreme-court

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు విధాన పరమైన నిర్ణయాలతో పాటు భారీ ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో అమరావతి, పోలవరంతో పాటు పలు కీలక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న వైసీపీ సర్కార్.. వీటిపై సిట్ దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని వాదించింది. అలాగే వీటిపై సీబీఐతోనూ విచారణ జరిపించాలని నిర్ణయించింది.

 cbn

దీనిపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలోనే సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టింది. అంత వేగంగా స్టే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గతంలోనే ప్రశ్నించింది. ఇవాళ దానికి అనుగుణంగానే తీర్పు కూడా ప్రకటించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయడంతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రభుత్వం ఇక సిట్ విచారణను పరుగులు పెట్టించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+