జగన్ సర్కార్ కు భారీ షాక్- సినిమా టికెట్ల రేట్ల జీవో కొట్టేసిన హైకోర్టు-టాలీవుడ్ కు ఊరట

ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని నియంత్రించేందుకు వీలుగా జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. కొత్త సినిమాలకు ధరలు పెంచకుండా నియత్రించేలా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై పిచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ప్రభుత్వ ఆదేశాల్ని తోసిపుచ్చింది.

big setback to jagan regime as high court suspended cinema ticket prices order

సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించే వెసులుబాటు పిటిషనర్లకు ఉందని స్పష్టం చేసింది. కొత్త సినిమాలు వచ్చినప్పుడు రేట్లు పెంచుకునే హక్కు థియేటర్లకు ఉందని పిటిషనర్లు వాదించారు. రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. దీనిపై హైకోర్టు ఏకీభవిస్తూ, సినిమా రేట్ల తగ్గింపు జీవోను రద్దు చేసింది. సినిమా రేట్లు పెంచుకోకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో థియేటర్ల యాజమాన్యాలు పిటిషన్ దాఖలు చేశాయి. వీరి తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ ల వాదనలు వినిపించారు.

వాస్తవానికి సినిమా టికెట్ల ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. అప్పటికే టాలీవుడ్ నిర్మాతలతో పలుమార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం.. కొత్త సినిమాలు, భారీ సినిమాల్ని సైతం విడుదలైన కొత్తలో రేట్లు పెంచుకునేందుకు వీల్లేకుండా జీవో నంబర్ 35ను తీసుకొచ్చింది. దీనిపై టాలీవుడ్ నిర్మాతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం దీనిపై ట్వీట్ చేశారు. అయితే దీనిపై సీఎం జగన్ తో చర్చిస్తామని చెప్పిన మంత్రి పేర్నినాని.. అనంతరం దీనిపై మౌనంగా ఉండిపోయారు. టికెట్ల రేట్లు పెంచుకోకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో టాలీవుడ్ లో కొందరిని టార్గెట్ చేసేందుకే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం దీనిపై పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు ఈ ఉత్తర్వుల్ని కొట్టేయడంతో ఈ నెలలో విడుదలవుతున్న అల్లు అర్జున్న కొత్త చిత్రం పుష్పతో పాటు వచ్చే నెలలో విడుదలయ్యే భారీ చిత్రాలకు సైతం ఊరట దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+