సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బిగ్ షాక్.. ఏపీ హైకోర్టులో పిల్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే ఒక మంచి చిత్రంగా నిలిచింది.
భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం
జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన తొమ్మిది రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం ఇప్పటికే పేర్కొంది. ఈ సినిమా తొలి రోజే 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. భారీ బడ్జెట్ ఆయన గేమ్ చేంజర్ ను పక్కకు నెట్టింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై హైకోర్టులో పిల్
అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ వసూళ్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని ఈ పిల్ లో ఆరోపించారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ ఏపీ హైకోర్టును కోరారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతకు ఊహించని కష్టాలు
అదేవిధంగా ఈడి, ఐటి, జిఎస్టి విచారణ జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ తర్వాత అనుకోని పరిణామాలలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు నివాసంలోనూ, కార్యాలయాలలోనూ గత నాలుగు రోజులుగా ఐటి దాడులు నిర్వహించారు. ఇక ఇదే సమయంలో క్విడ్ ప్రోకో జరిగిందని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ప్రస్తుతం సినీవర్గాలలో ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం
కాగా సంక్రాంతికి వచ్చిన సినిమాలలో చిన్న సినిమాగా అనిపించినా కూడా మిగిలిన సినిమాలను డామినేట్ చేసింది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లాభాలతో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications