వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. విశాఖలో వైసీపీ సీనియర్ నేత గుడ్ బై!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన పలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా విశాఖపట్నం కి చెందిన మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పడం జగన్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి.

వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నం కి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నిన్న రాత్రి తన రాజీనామా పైన ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన రాజీనామా లేఖను వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్టు పేర్కొన్నారు.

Big shock for YS Jagan senior leader Goodbye to YCP in Visakhapatnam

విశాఖలో వైసీపీకి షాక్
అయితే త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపైన ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.
పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నేత అయిన చొక్కాకుల వెంకటరావు ప్రస్తుతం పార్టీని వీడటం విశాఖలో పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. చొక్కాకుల వెంకటరావు వైఎస్ఆర్సిపి స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు.

వైసీపీలో కీలకంగా పని చేసిన చొక్కాకుల
2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమిపాలయ్యారు. అప్పుడు బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బిజెపిలో చేరారు.

జగన్ పాలనలో వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ చైర్మన్ గా అవకాశం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఆయన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రావు భార్య లక్ష్మికి విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా జగన్ అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత చొక్కాకుల కూడా అదే సంస్థకు చైర్మన్ గా పనిచేశారు.

బీజేపీలో చేరతారా? మరే ఇతర పార్టీలోకి వెళ్తారా?
ప్రస్తుతం గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో యాక్టివ్ గా పని చేయడం లేదు. చొక్కాకుల వెంకటరావు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలో ఆయన బిజెపిలో పనిచేయడంతో మళ్లీ ఆయన బిజెపి తీర్థం పుచ్చుకుంటారా లేదా కూటమిలోని మరే ఇతర పార్టీలోకి వెళతారా అన్నది కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+