వైఎస్ జగన్ కు బిగ్ షాక్.. అనూహ్యంగా పార్టీ వీడిన నేతలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో విడతలో మే 13న ఏపీ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగోతేదీన ఫలితాలు విడుదలవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా జనసేన కు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ నియోజకవర్గాలు దక్కాయి. వీటిల్లో కాకినాడ, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా, అసెంబ్లీకి 18 మంది అభ్యర్థులను ప్రకటించింది.

వీటిల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ రాజకీయవేత్త కొణతాల రామకృష్ణ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన అనుభవం ఉన్న కొణతాల తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అనకాపల్లి నుంచి కచ్చితంగా గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్న ఆయన వైసీపీ నాయకులకు గాలం వేస్తున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన మండల నాయకులు కొణతాల సమక్షంలో జనసేనలో చేరారు. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ తొలగించిన పేదల పింఛన్లను పునరుద్ధరిస్తామన్నారు.

big shock for ysrcp anakapalli leaders joined janasena

అధికార పార్టీగా మరోసారి అనకాపల్లి లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీకి వలసలు షాక్ ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ మరిన్ని చేరికలు ఉంటాయని కూటమి నేతలు చెబుతున్నారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్రాభివృద్ధికి కూటమి అవసరం చారిత్రాత్మకమన్నారు. అనకాపల్లి పట్టణం 83 వ వార్డు పరిధిలో లక్ష్మీ దేవి పేట లో టీడీపీ- జనసేన-బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో నాయకులంతా పాల్గొన్నారు. మున్సిపల్ వార్డుల పరిధిల్లో ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమావేశాలద్వారా వైసీపీ నాయకులను కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+