మోడీ రాక ముందే బీజేపీకి షాక్-విశాఖలో జెండాల తొలగింపు- అడ్డుకున్న సోమువీర్రాజు
ఏపీలో ప్రధాని మోడీ టూర్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం విశాఖకు ప్రధాని మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు విశాఖలో భారీ ఎత్తున జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు. మోడీ టూర్ ను వైసీపీ ప్రభుత్వం హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న నేతలు.. నగరంలో అడుగడుగునా తమ పార్టీ జెండాలు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. అయితే అంతా సవ్యంగా సాగిపోతోందని భావిస్తున్న తరుణంలో అధికారులు వారికి షాకిచ్చారు.
మోడీ రాక ముందే బీజేపీకి షాక్-విశాఖలో జెండాల తొలగింపు- అడ్డుకున్న సోమువీర్రాజు..!!#SomuVeerraju #BJP #AdhraPradesh #AndhraNews #OneIndiaTelugu pic.twitter.com/NAdbgwE1lb
— oneindiatelugu (@oneindiatelugu) November 11, 2022
విశాఖలో ప్రధాని మోడీ సందర్భంగా బీజేపీ నేతలు కట్టిన బ్యానర్లు, జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఇవాళ పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద కట్టిన బ్యానర్లు, జెండాలను నిబంధనల పేరుతో వారు తొలగిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన నుంచి వెళ్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకు ఈ దృశ్యాలు కనిపించాయి. అంతే ఆయన కారు ఆపి వారిపై భగ్గుమన్నారు. మోడీ బ్యానర్లు తొలగించేందుకు ఎంత ధైర్యమని ప్రశ్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విశాఖ నగరంలో సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద బీజేపీ జెండాల్ని అధికారులు తొలగిస్తున్న దృశ్యాలు ఇవాళ దర్శనమిచ్చాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వాటిని గమనించి అధికారులను నిలదీశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అధికారులు నీళ్ళు నమిలారు. దీంతో సోము వీర్రాజు వారితో వాగ్వాదానికి దిగారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని వారు ఆయనతో వాదించారు. విషయం తెలియడంతో స్ధానిక బీజేపీ నేతలు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కాసేపు ఉద్రిక్తత తర్వాత సోమువీర్రాజు మున్సిపల్ వాహనంలోని జెండాలను తిరిగి ఎక్కడ తీసారో అక్కడే కట్టాలని చెప్పి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications