మోహన్ బాబుకు బిగ్ షాక్.. యూనివర్సిటీ గుర్తింపు రద్దు, భారీ జరిమానా !!
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మోహన్‌బాబు. గత కొంతకాలంగా వారి కుటుంబ వ్యవహారాలతో హాట్ టాపిక్ గా మారారు. గొడవలు, కేసులతో మంచు వారి కుటుంబంలో కలహాలు పీక్స్ కి చేరగా.. పోలీసులు కౌన్సిలింగులతో కాస్త బ్రేక్ పడినట్టు భావించారు. కానీ రీసెంట్ గానే మళ్లీ ఈ ఇష్యూ బయటపడగా.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు ఉండడంతో అంతా సర్దుమనిగిందని భావిస్తున్నారు. ఇప్పుడు తన యూనివర్సిటీ వ్యవహారంలో వార్తల్లో నిలిచారు.
మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం..
తిరుపతి జిల్లా రంగంపేటలో 2022లో శ్రీవిద్యానికేతన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU) గా కొనసాగుతోంది. ఇంజినీరింగ్, గ్రీన్‌ఫీల్డ్ కోర్సులు, ఇతర కోర్సులు అందిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో 70 శాతం సీట్, గ్రీన్‌ఫీల్డ్ కోర్సుల్లో 35 శాతం సీట్లు ప్రభుత్వ నియంత్రణ కింద భర్తీ చేయబడతాయి. ఈ కోటా సీట్ల ఫీజులను హెచ్‌ఈసీ (HEC) నిర్ణయిస్తుంది.

అయితే 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు, యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రూ.26.17 కోట్లు అధికంగా వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. డే-స్కాలర్ విద్యార్థుల నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం, హాజరు తక్కువగా ఉందని ఆధారపడి అదనపు ఫీజులు వసూలు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులు AP Parents Association ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఉన్నత విద్యా కమిషన్ దర్యాప్తు..
అక్రమ ఫీజుల వసూలు విషయాన్ని దృష్టిలో ఉంచి, AP HEC ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసింది. దర్యాప్తులో యూనివర్సిటీ ఆదాయాన్ని గోపించడం, విద్యార్థుల హాజరులో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు అదనపు రూ.26.17 కోట్లను 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలని.. గతంలో విధించిన రూ.15 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని యూజీసీ, ఏఐసీటీఈకు సిఫారసు చేసింది. విద్యార్థులను సమీపంలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా అనుబంధం చేయాలని సూచించింది.
యూనివర్సిటీ యాజమాన్యం వాదనలు
కానీ యూనివర్సిటీ వాదన ప్రకారం విద్యార్థులు స్వచ్ఛందంగా అదనపు ఫీజులు చెల్లించారని చెప్పారు. కానీ కమిషన్ ఈ వాదనను తిరస్కరించి, ఫీజుల వసూలు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టం చేసింది. MBU యాజమాన్యం కమిషన్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది. ఫీజుల వాపసు, గుర్తింపు రద్దు సిఫారసును న్యాయస్థానంలో సవాలు చేసినప్పటికీ.. 26 సెప్టెంబర్ 2024న మూడు వారాల తాత్కాలిక స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 14 అక్టోబర్ 2025కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications