పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కు షాక్- అమరావతిలో భారీ ప్లైక్సీ చించివేత-అభిమానుల ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలతో పాటు సొంత పార్టీ జనసేన శ్రేణులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతిలో చోటు చేసుకున్న ఓ ఘటన ఆయనతో పాటు అభిమానులకూ షాక్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో అమరావతిలోనూ ఏర్పాటు చేశారు. ఇలా ఉద్దండరాయుని పాలెంలో ఏర్పాటు చేసిన ఓ భారీ ఫ్లెక్సీ నిన్నటి నుంచి అభిమానులతో పాటు స్ధానికుల్ని కూడా ఆకట్టుకుంటోంది. ఇవాళ పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫ్లెక్సీ వద్ద అభిమానులు పలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన కొందరు అగంతకులు దుశ్చర్యకు దిగారు.

ఉద్దండరాయుని పాలెంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసుకున్న భారీ ఫ్లెక్సీని నిన్న రాత్రి కొందరు అగంతకులు చించేశారు. భారీ ప్లెక్సీలో కొంత భాగం చించేయడంతో దీని రూపు కోల్పోయింది. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగుతున్నారు. తమ అభిమాన హీరో, జనసేనాని పుట్టినరోజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసుల్ని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లెక్సీ రాష్ట్రంలో మరో చోట ఎక్కడో చిరిగి ఉంటే అంత వివాదం అయ్యేది కాదేమో కానీ ఇది కాస్తా ప్రస్తుతం రాజధాని ఆందోలనలు జరుగుతున్న అమరావతిలో కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అమరావతికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇది జీర్ణించుకోలేని కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమరావతికి మద్దతిచ్చేందుకు నేరుగా రంగంలోకి దిగేందుకు పవన్ సంశయిస్తున్న నేపథ్యంలోనూ ఈ ఘటన జరిగి ఉండొచ్చని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా పవన్ పుట్టినరోజున జరిగిన ఘటన అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.
పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కు షాక్- అమరావతిలో భారీ ప్లైక్సీ చించివేత-అభిమానుల ఆగ్రహం#andhrapradesh, #amaravati, #pawankalyan pic.twitter.com/wKOVV2CW5i
— oneindiatelugu (@oneindiatelugu) September 2, 2021
పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కు షాక్- అమరావతిలో భారీ ప్లైక్సీ చించివేత-అభిమానుల ఆగ్రహం#andhrapradesh, #amaravati, #pawankalyan pic.twitter.com/Ryy2UqMBnE
— oneindiatelugu (@oneindiatelugu) September 2, 2021












Click it and Unblock the Notifications