వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 3963 పాజిటివ్ కేసులు, 52 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు మరింతగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా, శనివారం 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఏపీలో ఒక్క రోజే 3963 కేసులు, 52 మంది మృతి

ఏపీలో ఒక్క రోజే 3963 కేసులు, 52 మంది మృతి

తాజాగా 3963 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,609కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 589కు చేరిందని ప్రభుత్వం శనివారం బులిటెన్ విడుదల చేసింది. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖలో 2, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా కర్నూలు, తూర్పుగోదావరిలో..

అత్యధికంగా కర్నూలు, తూర్పుగోదావరిలో..

కాగా, రాష్ట్రంలో 22,260 యాక్టివ్ కేసులున్నాయి. 21,763 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.84 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 5681 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 5499 పాజిటివ్ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

జిల్లాల వారీగా కరోనా కేసులు..

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 994 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 550 కేసులు, అనంతపురం జిల్లాలో 220, చిత్తూరు జిల్లాలో 343, గుంటూరులో 214, కడపలో 145, నెల్లూరులో 278, ప్రకాశం 266, శ్రీకాకుళంలో 182, విశాఖపట్నంలో 116, విజయనగరంలో 118, పశ్చిమగోదావరి జిల్లాలో 407 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Vitamin C Rich Foods To Beat Corona విటమిన్ సి అధికంగా ఉండే ఈ ఫుడ్ తీసుకుంటే కరోనా మీ దరి చేరదు...!!
దేశంలోనూ కరోనా విజృంభణ..

దేశంలోనూ కరోనా విజృంభణ..


దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 10,46,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,63,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇక
6,56,444 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 26,351 మంది కరోనాతో మరణించారు.

English summary
Andhra Pradesh witnessed the highest single day spike of COVID-19 cases as well as deaths on Saturday. A staggering 3,963 persons tested positive for the virus taking the cumulative tally to 44,609 while 52 patients succumbed to the virus taking the toll to 586.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X