రైతుల అకౌంట్ లోకి రూ.23వేలు

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. వీటివల్ల వారికి అత్యధిక ప్రయోజనం కూడా కలుగుతోంది. కేంద్రానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ స్కీమ్, ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ఫసల్ బీమా యోజన... ఇలా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు పడుతున్నాయి.

రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్‌కు అదనం. బీహర్ ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకువచ్చింది. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 11,500 అందిస్తోంది. ఇలా ఒక్కో రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు డబ్బులు వస్తాయి. అంటే దాదాపు రూ. 23 వేలు వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది.

agriculture

వీటిని పొందాలనుకునేవారు కచ్చితంగా క్లస్టర్ లో సభ్యులుగా ఉండాలి. 25 మంది రైతులు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడాలి. ఈ గ్రూప్‌లో ఉన్నవారికే ఈ బెనిఫిట్ లభిస్తుంది. రైతులకు అందించే రూ. 11,500లో కనీసం రూ. 6500 తో సర్టిఫైడ్ కంపోస్ట్, ప్లాస్టిక్ డ్రమ్ వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 5వేలతో వర్మికంపోస్ట్ సిద్ధం ఇలా సేంద్రీయ వ్యవసాయం చేయవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నెల 15 కల్లా డబ్బులు వస్తాయని సమాచారం. ప్రభుత్వం నుంచి మాత్రం ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+