pawan kalyan birthday greetings :పవన్ కు శుభాకాంక్షల వెల్లువ-చిరు, చంద్రబాబు, సోము సహా

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు ఇంటా బయటా భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు ఏపీలోని రాజకీయ పార్టీల నేతలతో పాటు కుటుంబ సభ్యులు, సొంత పార్టీ జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియా కూడా మార్మోగుతోంది.

తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అన్న మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ తమ్ముడిపై చిరంజీవి పుట్టినరోజున తన అభిమానం చాటుకున్నారు.

birthday greetings to janasena chief pawan kalyan from brother chiranjeevi, chandrababu and others

జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి ట్విట్టర్ లో శుభాకాంక్షలు పెట్టడంతో పాటు కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేసుకున్నారు. ఇందులో ఆయన తమ్ముడు పవన్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడుతున్న ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఫొటోలు చూసిన అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు. చిరంజీవి పెట్టిన ఈ ట్వీట్ పై జనసేన పార్టీ కూడా అధికారికంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. చిరంజీవికి ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒకప్పటి మిత్రుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. "సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లూ ఆరోగ్య, ఆనందాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు తన ట్వీట్లో తన అభిమానాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం బీజేపీతో ఉన్న పవన్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ త్వరలో టీడీపీతో జత కట్టబోతోందన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

birthday greetings to janasena chief pawan kalyan from brother chiranjeevi, chandrababu and others
birthday greetings to janasena chief pawan kalyan from brother chiranjeevi, chandrababu and others

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం తన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ పుష్కర కాలంగా ఎన్నో పోరాటాలు సాగిస్తూ గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భరతమాత సేవలో తరించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ సోము తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+