వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ న్యూస్..దేనికైనా వెనుకాడం: టాప్ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఏపీ బీజేపీ నేతల వార్నింగ్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఓ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం సహా కొన్ని మీడియా సంస్థలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఏకపక్షంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే తాము రిజాయిండర్లు ఇచ్చినప్పటికీ.. ఏ మాత్రం ఖాతరు చేయట్లేదని పేర్కొన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని అన్నారు.

ఈ మేరకు సునీల్ దేవ్‌ధర్ ఓ ట్వీట్ చేశారు. తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సహా మరికొందరు నాయకులకు వ్యతిరేకంగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ సహా కొన్ని వార్తా సంస్థలు నకిలీ వార్తలను సృష్టిస్తున్నాయని అన్నారు. నకిలీ రిపోర్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలను ప్రసారం చేసి, బీజేపీ నాయకులపై దుష్ప్రచారాన్ని చేస్తోన్న అలాంటి ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు.

BJP AP Co Incharge Sunil Deodhar has warning to top Telugu news Channel

Recommended Video

Karnataka Minister Sriramulu Daughter Rakshitha Wedding Video | అబ్బురపరిచిన పెళ్లి ఏర్పాట్లు!

జీవీఎల్‌పై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనాన్ని ఆ ఛానల్ ప్రసారం చేసిందని సునీల్ దేవ్‌ధర్ అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జీవిఎల్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అవాస్తవ కథనాన్ని ప్రసారం చేశారని అన్నారు. దీనికి ఆ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికా, మీడియా విలువలను విస్మరించి తరచూ బీజేపీపై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తుస్తోందని విమర్శించారు. తమ వైఖరిని మార్చుకోకపోతే ఆ ఛానల్ చర్చలను బహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
Bharatiya Janata Party Andhra Pradesh Co Incharge Sunil Deodhar has warning to Top Telugu News Channel for telecasting fake news about Party's National Spoke person and Rajya Sabha member GVL Narasimha Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X