వారివల్లే ఓడామని బిజెపి, పట్టనట్లుగా తెలంగాణ టిడిపి!
హైదరాబాద్: తెలంగాణలో తమకు సీట్లు తగ్గడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణమని భారతీయ జనతా పార్టీ విమర్శించడంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ మంగళవారం స్పందించారు. వాళ్లేం మాట్లాడినా అది ఆ పార్టీ విషయమని, కానీ కాంగ్రెసేతర పక్షాలన్ని ఏకతాటి పైకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే హైదరాబాదులో అన్నారని గుర్తు చేశారు.
కాగా, టిడిపితో పొత్తే బిజెపిని ముంచేసిందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రెండు రోజుల క్రితం అభిప్రాయపడ్డారు.

బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ హవాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు.
బిజెపి ఓటమితో సాధారణ కార్యకర్తలు కూడా నిరాశకు లోనయ్యారన్నారు. పొత్తులను నిర్ణయించేది రాష్ట్ర నాయకత్వం కాదని, అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. మెదక్ లోకసభ స్ధానం నుంచి బిజెపి పోటీ పోటీచేసి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్దుబాట్లలో అవకతవకలు, ఆలస్యంగా అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు జయాపజయాలపై ప్రభావం చూపాయన్నారు.












Click it and Unblock the Notifications