జగన్ తప్పులు చేస్తున్నారు-కట్టడి చేయాల్సిందే : మరలా ఒకే వేదిక మీదకు పవన్-బీజేపీ నేతలు..!!
మరలా ఏపీలో బీజేపీ-జనసేన నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు. రెండు పార్టీల మధ్య రాజకీయంగా పొత్తు ఉన్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా రెండు పార్టీల తీరు కొనసాగుతోంది. ఎవరి కార్యక్రమాలు వారు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన పోరాటం విషయంలోనూ గతంలో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా ఎవరి అజెండా వారు అమలు చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తరువాత రెండు పార్టీల మధ్య మరింత గ్యాప్ కొనసాగుతుందనే వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి జనసేన అధినేత పవన్ తో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

మరోసారి రెండు పార్టీల నేతలు కలిసి...
జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం గా జనసేన అధినేత పవన్ విజయవాడ వచ్చారు. ఈ సమయంలో రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ థియోధర్ తో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధేశ్వరి హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఏపీ అర్దిక పరిస్థితుల పైన చర్చించారు. ప్రధానంగా కొద్ది రోజులగా ఏపీలో జరుగుతున్న ఆర్ధిక నిర్వహణ-కేంద్రం అభ్యంతరాలు- విమర్శళ పైనే ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రణాళికా లోపం కారణంగానే ఆర్దిక సమస్యలు ఏర్పుడుతున్నాయని నేతలు చెప్పుకొచ్చారు.

జగన్ పైనే టార్గెట్ ఫిక్స్..
రాష్ట్ర అర్దిక పరిస్థితి దిగజారుతోందని అందోళన వ్యక్తం చేసారు. ఆర్దిక నిబంధనల ఉల్లంఘన పైన కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లటం పైన సునీల్ థియోధర్ ప్రస్తావించారు. సోము వీర్రాజు..పురంధేశ్వరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోటు పాట్లను వివరించినట్లుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నష్టం పోకుండా ఏం చేయాలి... ఆర్దికంగా మరింత దిగజారకుండా తీసుకోవావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి రావటానికి ప్రభుత్వంలో ప్రణాళిక లోపమే కారణమనే అభిప్రాయం వ్యక్తం అయింది.

జగన్ పాలన పైనే యుద్దం..
కేంద్ర పెద్దల వద్ద ఏపీ ఆర్దిక పరిస్థితి పైన చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా పాలనా పరంగానూ అనేక నిర్ణయాలు లోప భూయిష్టంగా ఉన్నాయని జనసేన అధినేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. వీటన్నింటి పైనా లోతుగా చర్చించి కార్యాచరణ సిద్దం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, ఉమ్మడిగా చేపట్టాల్సిన ఆందోళన .. కార్యక్రమాల పైన చర్చించి-నిర్ణయించేందుకు త్వరలో రెండు పార్టీల ముఖ్య నేతలు మరో సారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికైనా కలిసి ముందుకు..
త్వరలో తెలంగాణ-ఏపీలో అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్న అంశం పైన చర్చించాలని భావించినా..ఏపీ పాలనా పరమైన అంశాల వరకే పరిమితమయ్యారు. త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, రెండు పార్టీలు పొత్తు ఖరారు అయిన తరువాత..ఇప్పటి వరకు ఉమ్మడి పోరాటాలు చేయలనే నిర్ణయాన్ని పక్కన పెట్టేసారు. రెండు పార్టీలు కలిసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఇక, అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించటం పైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసినట్లు సమాచారం.
Recommended Video

అడ్డుకోవాలంటే..కలిసి ఉండాల్సిందే..
చాలా గ్యాప్ తరువాత రెండు పార్టీలు నేతలు సమన్వయ కమిటీ సమావేశం పేరుతో సమావేశమయ్యారు. దీంతో...ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయా..లేక, కలిసే ఉన్నామని చెప్పటం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాయా అనేది రెండు పార్టీల అభిమానుల్లో వ్యక్తమవుతున్న సందేహం. ప్రస్తుతం సినిమాల్లో పవన్ పూర్తిగా బిజీగా ఉంటున్నారు. మరి...ఏపీ రాజకీయాల్లో బీజేపీ - జనసేన ప్రభావం ఏంటనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications