రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఇరుముడి' నుంచి బిగ్ అప్‌డేట్
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే తనదైన నటనతో మెప్పిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగిన వారిలో మాస్ మహారాజ రవితేజ ముందుంటారు. కర్తవ్యం, సింధూరం, నిన్నే పెళ్లాడతా తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి కెరీర్ ను బిగిన్ చేశారు రవితేజ. ఆ తర్వాత 1999లో తొలిసారిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమాతో హీరోగా తన నటన ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ సినిమాలు చేశారు. ఇడియట్ మూవీ రవితేజకు బిగ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, విక్రమార్కుడు, కిక్ సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టారు.
అయితే రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా లాంటి విజయాలతో వరుస హిట్స్ కొట్టిన రవితేజకు ఇటీవలి కాలంలో పెద్దగా విజయాలు రావడం లేదు. రవితేజ ఇటీవల నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని రవితేజ కసిగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు శివ నిర్వాణతో 'ఇరుముడి' అనే చిత్రం చేస్తున్నారు రవితేజ. సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది.

తాజాగా ఇరుముడి చిత్రం నుంచి ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లింప్స్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో ప్రత్యేక గ్లింప్స్ ను జూన్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతురు మధ్య భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా పోస్టర్ డిజైన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయ్యాక చిత్రంపై మరింత క్లారిటీ రానుంది. ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications