అవినాష్ రెడ్డి విషయంలో కేంద్రం స్టాండ్ ఇదే- పురంధేశ్వరి కామెంట్స్...
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ మీనమేషాలు లెక్కిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రానికీ, వైసీపీ సర్కార్ కూ మధ్య ఉన్న బంధం కారణంగానే సీబీఐ అవినాష్ విషయంలో దూకుడుగా వ్యవహరించడం లేదని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నేత పురంధేశ్వరి దీనిపై స్పందించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై స్పందించిన పురంధేశ్వరి.. అవినాష్ రెడ్డి అరెస్టుపై కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చిచెప్పేశారు. సీబీఐ స్వతంత్ర సంస్ధ అని ఆమె తెలిపారు. సీబీఐ వ్యవహారశైలిపై వస్తున్న విమర్శల్ని పురందేశ్వరి తప్పుబట్టారు. దీంతో పురందేశ్వరి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. సీబీఐ తీరుపై అటు వైసీపీ, ఇటు విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్న తరుణంలో పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.

అటు వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి విమర్శలు ఎక్కుపెట్టారు. కడప బెంగుళూరు వయా రాయచోటి నుండి వెళ్లే రైల్వె లైన్ ను క్యాన్సిల్ చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి లేక రాశారంటే ఈ ప్రాంత పంజలపై ఎంత ప్రేమవుందో అర్ధమవుతోందన్నారు. క్షేత్రస్థాయి నుండి బీజేపీని పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల నుండి దేశానికి చేసిన సేవ,రాష్ట్రలకు అందించిన సహకారం ద్వారా ప్రజలకు జరిగిన మేలును ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ప్రజలకు చేరువవుతామన్నారు.
రాష్ట్రంలో ఆరాచక, విధ్వంసపూరీత పాలనతో ఆంధ్ర ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభంలో నడుస్తోందని పురంధేశ్వరి తెలిపారు.కేంద్రం నుండి వస్తున్న నిధులను సరైన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తారీకున జీతాలు చెల్లించలేని పరిస్థులలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. వైసీపీకి చెందిన సర్పంచులు నేడు తమకు కేటాయించిన నిధులను ఇవ్వలేని దీనావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇన్ని నిధులు ప్రక్కదోవ పాటించిన రాష్ట్ర అభివృద్ధి శూన్యమన్నారు.












Click it and Unblock the Notifications