'కాంగ్రెస్‌తో జట్టుకు టీడీపీ సిద్ధం, నారా లోకేష్‌ను సీఎం చేసి.. ఇదీ చంద్రబాబు ప్లాన్!'

విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం మరోసారి మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో పాలనను గాలికి వదిలేశారన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు. చంద్రబాబు వారం రోజులుగా నవ నిర్మాణ దీక్షల పేరుతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీతో కలవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమయిందని ఆరోపణలు చేసారు. బీజేపీ నాకు భయపడి ఎన్డీయే మిత్రపక్షాలతో సమావేశాలను నిర్వహిస్తోందని చంద్రబాబు అనడం హాస్యాస్పదం అన్నారు. ఆయన మాటలు చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు. అసలు చంద్రబాబే భయపడుతూ ప్రజలను రక్షణగా ఉండాలని కోరుతున్నారని గుర్తు చేశారు.

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వస్తుంది

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ వస్తుంది

కేంద్ర పథకాలు తమవి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్ కేంద్రం ఇస్తే తన గొప్పగా చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో 10న బీజేపీ సభన 11న భారీ ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేస్తే నిధులిస్తామని కేంద్రం చెబితే రాష్ట్రం ఎందుకు అలా చేయడం లేదన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తప్పకుండా వస్తుందని చెప్పారు.

జనసేన, బీజేపీ వల్లే టీడీపీ గెలిచింది

జనసేన, బీజేపీ వల్లే టీడీపీ గెలిచింది

నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. ఈ దీక్షల కారణంగా ఉద్యోగులంతా కార్యాలయాల్లో లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కనిపించడం లేదని అన్నారు. 2014లో బీజేపీ, జనసేనల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

 లోకేష్‌ను సీఎం చేసి, తాను ప్రధాని కావాలని చంద్రబాబు భావిస్తున్నారు

లోకేష్‌ను సీఎం చేసి, తాను ప్రధాని కావాలని చంద్రబాబు భావిస్తున్నారు

తన కొడుకు నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసి తాను ప్రధాని కావాలని చంద్రబాబు భావిస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. మోడీని దేశ ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారని, చంద్రబాబు ప్రధాని కావాలని ఎప్పుడూ, ఎవరూ అనుకోలేదని సోము వీర్రాజు అన్నారు. మోడీకి, చంద్రబాబుకు పోలికే లేదన్నారు.

 చంద్రబాబులాంటి కుట్రపూరిత నాయకుడు లేడు

చంద్రబాబులాంటి కుట్రపూరిత నాయకుడు లేడు

మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం టీడీపీ ఎన్నడూ సహకరించలేదన్నారు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత రాజకీయ నాయకుడు మన దేశంలో ఇంకెవ్వరూ లేరని వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు టీడీపీ రెడీ అయింది కాబట్టే బీజేపీపై విమర్శలు చేస్తోందన్నారు. 1951లో బీజేపీ ఏర్పడిందని, టీడీపీ లాంటి పార్టీలకు భయపడదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+