ఇక తప్పుకోండి.. ఆ నేతలకు తేల్చి చెప్పిన బీజేపీ హైకమాండ్..!!
తెలంగాణ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాదిన తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయింది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాల అమలుకు సిద్దమైంది. ప్రధాని మోదీ- అమిత్ షా ద్వయం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇద్దరూ స్వయంగా రాష్ట్రంలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలకు బాధ్యతల నిర్వహణ పైన తేల్చి చెబుతున్నారు. కీలక హెచ్చరిక చేసారు.
తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక హెచ్చరిక చేసింది. రాష్ట్రంలో మారుతున్న తాజా సమీకరణాల వేళ బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ముఖ్య నేతలను తెలంగాణలో మోహరిస్తోంది. వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల కాలం పూర్తి కావటంతో.. ఇక వేగం పెంచాలని నిర్ణయించింది. కాగా, తాజాగా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పని చేయనప్పుడు పోస్టులు ఎందుకని, బాధ్యతలు నిర్వర్తించలేకపోతే వేరే వాళ్లకు ఆ పదవులు ఇచ్చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ తెలంగాణ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదని, నాయకులు కేవలం హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదని, గ్రౌండ్ స్థాయి వరకు వెళ్లాలని స్పష్టం చేశారు.

బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఫోకస్
అదే విధంగా బహిరంగ సభల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం వల్ల వచ్చే ఇంపాక్ట్ కంటే, నేరుగా ప్రజల్లోకి వెళ్లి చిన్న సమూహాల వద్దకు చేరి నలుగురితో కలిసి చాయ్ తాగుతూ మాట్లాడితే వచ్చే ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని బన్సల్ సూచించారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాల్లో కనీసం రెండు మూడు కార్యక్రమాలనైనా పరిపూర్ణంగా అమలు చేయకపోతే ఎలా అని బన్సల్ ప్రశ్నించారు. పార్టీ పైన కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ర్యాలీల ద్వారా గట్టిగా తిప్పికొట్టాలని సూచించిన సునీల్ బన్సల్, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేసి తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పని చేసుకోవాలని బన్సల్ తేల్చి చెప్పారు. దీంతో.. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకునేలా సిద్దం అయినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
