దేశంలోనే టాప్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తెలంగాణా: సీఎం రేవంత్ కీలకప్రకటన!

రక్షణ రంగంలో భారత్‌ను ప్రపంచ సూపర్‌పవర్‌గా నిలబెట్టాలని, ఆ దిశగా తెలంగాణ అతిపెద్ద భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో భాగంగా 'రక్ష ఎక్స్‌పో 2026' నిర్వహించనున్నారు. దీనికి సన్నాహకంగా తాజాగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం లోగోను ఆవిష్కరించి, రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష, అంతర్గత భద్రత రంగాలకు చెందిన 90 మందికి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించారు. యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగాలి. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ ఇప్పటికే గణనీయమైన పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో రక్షణ రంగంలో అతిపెద్ద భాగస్వామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అని సీఎం అన్నారు.

CM Revanth Reddy on Raksha Expo 2026 Aims to Make Telangana India s Top Defence Manufacturing Hub

త్వరలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను విడుదల చేస్తామని, అది తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని ప్రకటించారు.హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉందని సీఎం వివరించారు. డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్, బీడీఎల్, మిథాని, టాటా, లాక్‌హీడ్ మార్టిన్, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. భారత సైన్యం, వైమానిక దళాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రాలు, పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంలో సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రమైన తెలంగాణ భారత నౌకాదళానికి కూడా కీలక సేవలందిస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నౌకాదళ రాడార్ కేంద్రం నిర్మాణంలో ఉందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీ, ఐఎస్‌బీ, బిట్స్ వంటి ఉత్తమ విద్యాసంస్థలు ఉన్నాయని, నైపుణ్యాలున్న మానవ వనరులను తయారు చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్నది తన లక్ష్యమని, ప్రస్తుతం రాష్ట్రం 5 శాతం అందిస్తున్నప్పటికీ జనాభా వాటా కేవలం 2.5 శాతమేనని గుర్తు చేశారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాలే ఈ లక్ష్య సాధనలో కీలకమని అన్నారు.

పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. ''మీ పెట్టుబడులను రెట్టింపు చేయండి. మీ లక్ష్యాలు సాధించేందుకు అవసరమైన అనుమతులు, భూమి కేటాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే ప్రతి పెట్టుబడిదారుడితో నేనే స్వయంగా మాట్లాడతా. మీ లాభాలను రెట్టింపు చేసే పూచీ మాది'' అని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2023-24లో రూ.15,900 కోట్లుగా ఉన్న ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు ప్రస్తుతం రూ.32,850 కోట్లకు చేరాయని తెలిపారు. ఆదిభట్లలో టాటా-బోయింగ్ భాగస్వామ్యంతో అపాచీ హెలీకాప్టర్ల ప్రధాన బాడీ భాగాలు తయారవుతున్నాయన్నారు.

తెలంగాణ కరవు నివారణకు సమరశంఖం.. రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.. సక్సెస్ అయితే...
తెలంగాణ కరవు నివారణకు సమరశంఖం.. రూ.150 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.. సక్సెస్ అయితే...

ప్రముఖ పారిశ్రామికవేత్త బాబా కల్యాణి తమ కంపెనీ 12 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో మరింత భారీ పెట్టుబడులు పెట్టే దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు. స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన తెలంగాణను రాకెట్ సిటీగా అభివర్ణించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పారిశ్రామికాభివృద్ధికి నిరంతర విద్యుత్ సరఫరా కీలకమని, అందిస్తామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+