జగన్ కేంద్ర పథకాల స్టిక్కర్లు మార్చి .. ఏం చేశారో చెప్పిన బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై బిజెపి నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు పరిపాలన తెలియడం లేదని,ఏపీలో నిర్మాణరంగ కార్మికులు నానా ఇబ్బందులు పడుతూ పస్తులు ఉంటున్నా జగన్ కు పట్టడంలేదని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జగన్ పాలనపై బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీ సీఎం జగన్ కేంద్ర పథకాల స్టిక్కర్లు మార్చి ఏం చేశారో బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేఖత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి కేంద్ర పథకాల స్టిక్కర్లు మార్చి తనవిగా చెప్పుకుంటున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు . జగన్‌ స్టిక్కర్‌ స్కీమ్‌లకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకుంటున్న జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 BJP leader Vishnu Vardhan Reddy outrage on jagan about raithu bharosa

రైతుభరోసా విషయంలో జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని విష్ణు వర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ ఎన్నికల హామీలో 12, 500 ఇస్తానని ప్రకటించారని , అలా ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టటంలో జగన్ అందెవేసిన చెయ్యి అన్నారు. కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను కూడా కలిపి రైతులకు 13,500 ఇస్తున్నట్టు చెప్పిన ఆయన కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన పథకం 6 వేల రూపాయలు కాకుండా 12, 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కేంద్రం ఇచ్చిన రూ.6వేలతో కలిపి అయితే మొత్తం రూ.18,500 ఇవ్వాలని ఏపీ సర్కార్‌ను విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణవంటి నేతలు జగన్ మీద ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా విష్ణు వర్ధన్ రెడ్డి కూడా జగన్ కేంద్ర పథకాలస్టిక్కర్లు మార్చి తనవి అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+