అప్పుల అదానీకి 60 ఎకరాలా ? బీజేపీ విష్ణుకుమార్ రాజు ప్రశ్న- జగన్ చులకనైపోయారంటూ..
నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైజాగ్ లో అదానీకి 60 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు.
విశాఖపట్నం: ఏపీలో వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ వ్యూహరచన చేస్తుంటే దాన్ని భగ్నం చేసేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సమస్యలూ తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ సర్కార్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంపై ఇవాళ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది దిక్కుమాలిన ప్రభుత్వమన్నారు. నిరహార దీక్ష సంవత్సరం చేసినా పట్టించుకునే ప్రభుత్వం కాదని మండిపడ్డారు.అమరావతి రైతులు ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వైసీపీ ప్రభుత్వమని...ఎన్నుకున్న ప్రజలకు బాగా బుద్ధి వచ్చిందని అన్నారు. 2024లో వైసీపీ బయటకు పోవడం ఖాయమని చెప్పారు.ఎస్సీ, ఎస్సీ నిధులను సైతం దారి మళ్లించారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

ఆదానీ మీద సీఎం జగన్ కు ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆదానికి మరో ఆరవై ఎకరాలు ఎందుకు ఇచ్చారని ఆయన ఇవాళ సూటిగా ప్రశ్నించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టును జగన్ దోచిపెట్టారని అదానీకి దోచిపెట్టారని విమర్శించారు. జగన్ భారీగా దోపిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ గారు మీరు ప్రజల్లో చులకనైపోయారు అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications