వైసీపీకి ఓటమి భయం - దొంగ ఓటర్లు బారులు తీరారు : త్వరలోనే చమరగీతం- సోము వీర్రాజు..!!
బద్వేలు బై పోల్ జరిగిన తీరు పైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్‌లో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే 55 శాతం కూడా ఓటింగ్ మించకూడదని, దొంగ ఓట్లు వేసుకున్నారు కాబట్టే ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఆ కారణంగానే.. ఎక్కువ ఇన్‌చార్జ్‌లను పెట్టుకున్నారని అన్నారు. మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వైసీపీ నాయకులు.. బీజేపీ ఏజెంట్లను ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికను తలపించారని దుయ్యబట్టారు.

28 చోట్ల రీపోల్ నిర్వహించాలి
బద్వేలులో 28 చోట్లలో రిపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ లాగా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఫైర్ అయ్యారు. బద్వేల్‌లో జరిగింది బై పోల్ కాదని, బస్ పోల్ అని ఎద్దేవా చేశారు. బద్వేల్‌లో దొంగ ఓటర్లు బారులు తీరారని సోము వీర్రాజు ఆరోపించారు. సిద్దవటం, కడప, ప్రొద్దుటూరు నుంచి స్ధానికేతరులను ప్రత్యేక వాహనాల్లో తరలించారని విమర్శించారు.

దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ
బద్వేలు ఉప ఎన్నికలో అడుగడుగునా దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిచారని కొందరు అధికారులు సైతం సహకరించారంటూ మండిపడ్డారు. బద్వేలులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేశారంటూ వీర్రాజు ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు బద్వేల్‌లో అడుగడుగునా దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. చీఫ్ విప్ ప్రవర్తన చాలా విడ్డురంగా ఉందన్నారు.

ఆ కారణంగానే పోలింగ్ శాతం పెరిగింది
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల కారణంగానే 53 శాతం జరుగాల్సిన పోలింగ్ 68 శాతానికి పెరిగిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేల్‌లోనే తిష్ట వేశారని అన్నారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి అట్లూరు కొనరాజుపల్లెలో తిష్ట వేశారని అన్నారు. పరిగపల్లెలో దొంగ ఓటర్లను బీజేపీ అభ్యర్థి పట్టుకున్నారని అన్నారు. అధికారులు చాలా మంది నియమ నిబంధనలను అతిక్రమించారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
Recommended Video

మెజార్టీ పైనే వైసీపీ ఆశలు
పోలింగ్ జరుగుతున్న సమయంలో సైతం బీజేపీ నేతలకు అధికారులకు ఫిర్యాదులు చేసారు. పోలింగ్ ముందు రోజు బీజేపీ ముఖ్య నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి బద్వేలు ఎన్నిక గురించి ఫిర్యాదు అందించారు. ఇక, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ నేతలే బీజేపీకి ఏజెంట్లుగా పోలంగ్ కేంద్రాల్లో కూర్చున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం బద్వేలు లో సాధించే మెజార్టీ పైనా లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో...ఎవరి అంచనాలు ఎలా ఉన్నా నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications