ముచ్చెమటలు, బాబు ఢిల్లీ వేళ్తే: కేసిఆర్ పాలనపై బీజేపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నెల రోజుల పాలన పైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ నెల రోజుల పాలన తెలంగాణ ప్రజలకు ముచ్చెమటలు పట్టించిందన్నారు. అరాచకానికి, రాక్షసత్వానికి అద్దం పడుతోందని ఆరోపించారు. నాడు వైయస్ హయాంలో వక్ఫ్ భూములంటూ ఐటీ కంపెనీలను బ్లాక్ మెయిల్ చేశారని.. అదే పాత్రను ఇప్పుడు కేసీఆర్ పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
గురుకుల్ ట్రస్ట్ భూములకు సంబంధించి వేలాది పేదల జీవితాలతో చెలగాడమాడుతున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇళ్లు కూల్చివేసేందుకా అని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీలో కట్టడాలు అక్రమమని చెబుతున్న ప్రభుత్వానికి పాతబస్తీలోని అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పరిపాలిస్తున్నది అధికారులా, మంత్రులా లేక ఎంస్‌వోలా అఏన్నారు.
టీవీ ఛానళ్ల విషయమై అధికారాన్ని శాసన సభాపతికి అప్పగించగా.. ఎంఎస్‌వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం రాక్షస పాలనకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడ నేను.. అక్కడ జగన్ అని చెబితే దానిని రాజకీయ కోణంలో చూశామని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైయస్ హయాంలో బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు వంటి పరిస్థితులను కల్పిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు.
మణికొండలో ఐటి కంపెనీలను వక్ఫ్ భూముల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆ భూములు ముమ్మాటికి వక్భ్ భూములు కాదని ఓ సర్వే తేల్చిందన్నారు. వైయస్ హయాంలో దానిని టాంపరింగ్ చేశారన్నారు. ఆ భూములకు సంబంధించిన సమగ్ర ఆధారాలు బయటపెట్టాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటుంటే తెలంగాణ సీఎం, మంత్రులు మాత్రం నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ
నూతన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం పనితీరు అంత బాగోలేదని బిజెపి శాసన సభా పక్ష ఉప నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బుధవారం ఆరోపించారు.

బీజేపీ
కెసిఆర్ చర్యలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ప్రభాకర్ అన్నారు. గురుకుల్ ట్రస్టు భూముల వ్యవహారం అక్రమం అని ఎపుడు నిర్ణయానికి వచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

బీజేపీ
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అవి అక్రమం కాదని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్రమమే అని కూలదోస్తోందని ప్రభాకర్ విమర్శించారు. పాతబస్తీలో ఉన్న అక్రమ కట్టడాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు.

బీజేపీ
వక్ఫ్ పేరిట మణికొండలోని నివాసులను అధికారులు బెదిరిస్తున్నారని, అధికారుల అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభాకర్ అన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications