కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే - స్టీల్ ప్లాంట్ పై సీఎం ప్రస్తావించలేదు: ఎంపీ జీవీఎల్..!!
ఏపీలో సామాజిక వర్గం చుట్టూ ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. కొద్ది రోజులుగా కీలకమైన కాపు నేతలు పార్టీలకు అతీతంగా సమావేశం అవుతున్నారు. ఏ పార్టీలో ఎవరు ఉన్నా.. కాపుల ప్రాధాన్యత పెరిగే విధంగా వ్యవహిరించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసారు. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ సైతం తాజాగా కాపు - బీసీ - ఎస్సీ వర్గాలు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉండాలంటూ లేఖ రాసారు. ఆ దిశగా ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు బీజేపీ నేతలు సైతం ఇదే నినాదం వినిపిస్తున్నారు.

కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే
కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనే అని ఆ పార్టీ సీనియర్ నేత..రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇక, విభజన హామీల అమలు, ప్రాజెక్టుల పనితీరు చారు. బీజేపీ విధానమే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అని వెల్లడించారు. ఇదే నినాదంతో ప్రధాని మోదీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేకంగా విస్తృతంగా నిధులు సమకూర్చిందని... కేంద్రం ఎంత మేలు చేసినా దానిని కప్పిపుచచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కాపు ఓట్ బ్యాంకుపై బీజేపీ ఆశలు
ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో సమావేశమైన సమయంలో స్టీల్ ప్లాంట్, పోలవరం వంటి అంశాలను ప్రస్తావించినట్లుగా ఎక్కడా వినపడలేదని వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇక, విభజన హామీల అమలు, ప్రాజెక్టుల పనితీరు ను ఆయన సమీక్షించారు. కాపు సమీకరణంలో భాగంగానే ఏపీలో గతంలో కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి ఇచ్చిన బీజేపీ..తిరిగి ఆయన స్థానంలో గోదావరి జిల్లాలకు చెందని సోము వీర్రాజుకు కేటాయించారు.
Recommended Video

ముద్రగడ కొత్త పార్టీ ప్రచారం పైనా ఫోకస్
ఇక, ఏపీలో క్రమేణా విస్తరించాలని భావిస్తున్న ఈ సమయంలో ఏపీలో సామాజిక వర్గాలే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా గుర్తించిన బీజేపీ..ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే.. జనసేనతోనూ పొత్తు కలిసి వస్తుందనే అంచనాల్లో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే, ఇప్పుడు ఏపీలో వేగంగా కాపు నేతలు సమావేశాలు.. ముద్రగడ కొత్త పార్టీ దిశగా అడుగులు..ఇప్పుడు బీజేపీ సైతం కాపులకు న్యాయం చేస్తామంటూ ముందుకొస్తున్న క్రమంలో రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.












Click it and Unblock the Notifications