ఏపీకీ 5జీ సేవలు ప్లీజ్-విజయవాడ, విశాఖ సహా ఈ నగరాల్లో- కేంద్రానికి జీవీఎల్ లేఖ

ఏపీలోని విశాఖపట్నం సహా పలు నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్రానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ లేఖ రాశారు. విశాఖపట్నంలో 5G సేవల వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో కేంద్రమంత్రికి ఆయన వివరించారు.

రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ఇవాళ రాసిన లేఖలో దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు. అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ 5G టెక్నాలజీ డిజిటల్, ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్న జీవీఎల్.. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.

bjp mp gvl narasimharao urges centre to start 5G sevices in these cities in ap

కేంద్రమంత్రికి రాసిన లేఖలో ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ గుర్తుచేశారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని, ఏపీకి నిజమైన ఆర్థిక వృద్ధిని ఇచ్చే ఇంజిన్ వంటిదని ఎంపీ తెలిపారు. విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉందని, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని తెలిపారు. కాబట్టి విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక, ముఖ్యమైన ప్రాంతమని జీవీఎల్ తెలిపారు. ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అభ్యర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+