తెలంగాణాతో పోలిస్తే ఏపీలో మరీ అధ్వానపు రోడ్లు: బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు!!
తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎంపి సోయం బాపూరావు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి, తెలంగాణ కంటే ఏపీ వెనుకబడి ఉందన్నారు. ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించిన అదిలాఆద్ ఎంపీ సోయం బాపూరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితిని పేర్కొని, ఇంత అధ్వానమా అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జన జాతి సురక్ష మంచ్ నిర్వహించిన ర్యాలీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. ఆయనతో పాటు బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురస ఉమామహేశ్వరరావు, కేంద్ర ఫిలిం బోర్డు సభ్యుడు చల్లా రామకృష్ణ తదితరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను తెలంగాణ రాష్ట్రమే వెనుకబడి ఉంది అని అనుకున్నాను అని, చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ అధ్వానపు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు అద్వానంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన, 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాల అభివృద్ధి చెందకపోవడం దారుణమని సోయం బాపూరావు వ్యాఖ్యానించారు. పాడేరు వాసులు విశాఖకు ఎలా వెళ్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.
ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాలలో ఒకరు కూడా చదువుకోని వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. మొత్తానికి సోయం బాపూరావు చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కాస్త అభివృద్ధి చెందింది అని అర్థం వచ్చేలా సాగాయి. ఇదే సమయంలో ఏపీ రోడ్ల దుస్థితిని కళ్ళకు కట్టాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications