బీజీపీ జాతీయ నేత పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక
ఏపీ బిజెపి మహిళా నేత, ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజెపి జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. పురంధరేశ్వరికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పురంధరేశ్వరి చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది.
ఇటీవల బీజేపీ అధిష్టానం ఆమెకు జాతీయ కార్యవర్గంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్న ఆమెను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో ఆమెకు ఎవరి ద్వారా అయిన కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెకు పదవి దక్కిన తర్వాత, పురంధరేశ్వరిని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు.

ఇక మరో పక్క భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో ఇండియా లో కొత్తగా 80,472 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 62 లక్షలు దాటింది. ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ కేసులు కాగా , 51,87,826 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
Recommended Video
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications