మోడీని జగన్ కలిస్తే తప్పేంటి, కేసులకేం సంబంధం: బాబుకు బీజేపీ గట్టి షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకిచ్చారు.

కలిస్తే తప్పేమిటి
జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. జగన్‌పై కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని తేల్చి చెప్పారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎవరినైనా కలవవచ్చునని చెప్పారు.

జగన్ ఒక్కరే వెళ్లలేదు కదా..
ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు జగన్ ఒక్కరే వెళ్లలేదని, ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. అసలు ప్రధాని మోడీని కలవడానికి కేసులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కేసులు కోర్టుల విషయం అన్నారు.

సిద్ధార్థనాథ్ గట్టి జవాబు
కాగా, జగన్ ప్రధాని మోడీని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్‌కు మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సిద్ధార్థనాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

టిడిపి ఆరోపణలు
ఈడీ, సీబీఐ కోర్టుల్లో 12 ఛార్జీషీట్లలో నమోదైన ఆర్థిక ఉగ్రవాది జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడం చాలా దురదృష్ణకరమని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వల్లే ప్రధాని మోడీని జగన్ కలిశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications