వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ రాజకీయం తెలియకుండా ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్..?

|
Google Oneindia TeluguNews

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రకటించడానికి జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం భార‌తీయ జ‌న‌తాపార్టీ అంగీక‌రించడంలేదు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనే తమ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆ పార్టీ నేతలు బుజ్జగించారు. అదే సమయంలో ఒక షరతు కూడా విధించారు.. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని. కానీ అందుకు పవన్ కల్యాణ్ నిరాకరించారు. అప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. చివరకు జేపీ నడ్డా పర్యటనకు, ప్రధానమంత్రి పర్యటనకు కూడా వపన్ ముఖం చాటేశారు.

 తిరుప‌తి లోక్‌సభ ఉప ఎన్నిక స‌మ‌యంలో..

తిరుప‌తి లోక్‌సభ ఉప ఎన్నిక స‌మ‌యంలో..


తిరుప‌తి లోక్‌స‌భ‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో పోటీకి దిగిన బీజేపీ అభ్య‌ర్థికి జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలియజేసింది. ఆ స‌మ‌యంలో త‌మ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ బీజేపీ నేత‌లంతా ముక్తకంఠంతో ప్ర‌క‌టించారు. అయితే షరతువల్ల పెరిగిన దూరం ఇప్పటివరకు తగ్గలేదు. అవరావతి గ్రామాల్లో చేసిన పాదయాత్ర కూడా ఆ పార్టీ ఒంటరిగానే చేపట్టింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 5వేలకు పైగా సభలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్ గా నియమించింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ ఒంటరిగానే వెళ్లడానికి సిద్ధపడినట్లు స్పష్టం చేస్తున్నాయి.

ప‌వ‌న్ లాంటి ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడి కోసం బీజేపీలో వేట?

ప‌వ‌న్ లాంటి ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడి కోసం బీజేపీలో వేట?


ఏపీకి సంబంధించినంత‌వ‌ర‌కు బీజేపీతో పోల్చుకుంటే జ‌న‌సేనే అతి పెద్ద పార్టీ. పవన్ పార్టీని విలీనంచేస్తే ప్రజాదరణ ఉన్న నాయకుడు దొరకడంతోపాటు కీలకమైన సామాజికవర్గం ఓట్లన్నీ గుంపగుత్తగా లభించే అవకాశాలుండటంతో ఆ దిశగా బీజేపీ ప్రయత్నించింది. జనసేనాని తిరస్కరించడంతో బీజేపీ తన కార్యక్రమాలు తాను నిర్వహించుకుంటోంది. ప్రజాదరణ ఉన్న నాయకుడి కోసం వేట ప్రారంభించింది. ఇందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

25 సంవత్సరాలకు సిద్ధపడి వచ్చా

25 సంవత్సరాలకు సిద్ధపడి వచ్చా


విలీనం చేయాలని బీజేపీ కోరినప్పటికీ తాను తిరస్కరించానని, తాను 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికి సిద్ధపడి వచ్చానని పవన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. పొత్తుద్వారానే తమ పార్టీని బీజేపీ వ్యూహాత్మ‌కంగా నిర్వీర్యంచేసే ప్ర‌య‌త్నం సాగిస్తోందని జనసేనాని అనుమానపడుతున్నారు. అందుకే కోవర్టుల గురించి బహిరంగంగానే ప్రకటించి ఇతర నాయకులను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కోవర్టులు మారే అవకాశమున్నవారు కూడా వెనక్కి తగ్గుతారనేది ఆయన ఆలోచనగా ఉంది. బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడి కోసం, బలమైన సామాజికవర్గ అండకోసం బీజేపీ కొనసాగిస్తున్న వేట ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ రెండు విషయాల్లో తమకు సంతృప్తి కలిగినప్పుడే వేట ముగుస్తుందని పార్టీ అధినాయకత్వ వైఖరిని దగ్గర నుంచి చూసిన నేతలు చెబుతున్నారు.

English summary
Is the BJP strategically weakening Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X