మోడీపై సంచలనం: బాబును అణగదొక్కాలని, అంత లేదు.. బుద్ధా అలా, సుజన ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని కక్ష పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఒకరు అంటే, ఆ స్థాయి వ్యక్తి అలా చేయలేరని మరొకరు చెబుతున్నారు.

చదవండి: 'చంద్రబాబుకు చెంపపెట్టు, అందరూ రాజీనామా చేయాలి, 21న కలిసిరండి'

మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్థిక నేరస్థులకు అపాయింటుమెంట్ ఇచ్చి, సీఎం చంద్రబాబుకు ఇవ్వలేదన్నారు.

చదవండి: ఆ తర్వాత భద్రత కావాలి, ఎందుకంటే: డీజీపీకి పవన్ లేఖ, ఇంటిమీదపడ్డ వారికి ఫ్యాన్స్ ఇలా..

మోడీపై బుద్ధా వెంకన్న తీవ్రవ్యాఖ్యలు

మోడీపై బుద్ధా వెంకన్న తీవ్రవ్యాఖ్యలు

నాడు గుజరాత్‌లో ముస్లీంలను ఊచకోత కోస్తే ఏపీలో చంద్రబాబు ముస్లీంల పక్షాణ నిలబడ్డారని బుద్దా వెంకన్న అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముస్లీంల పక్కన నిలబడినందుకు అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.

  Modi's Reaction on Ashok Gajapathi Raju, Sujana Chowdary's resign
  మోడీ-చంద్రబాబు మధ్య మనస్పర్థలు లేవు

  మోడీ-చంద్రబాబు మధ్య మనస్పర్థలు లేవు

  అంతకుముందు, సుజన ఓ ఛానల్‌తో ముఖాముఖిలో మాట్లాడారు. తాము మోడీకి వ్యతిరేకం కాదని, ఇచ్చిన హామీలు అమలుపరచాలని అడుగుతున్నామని చెప్పారు. హామీలను అమలు చేయాలని నిరసిస్తూ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు. మోడీ, చంద్రబాబు మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.

  ఆ స్థాయిలో ఉన్నారు, అలా ఉండదు

  ఆ స్థాయిలో ఉన్నారు, అలా ఉండదు

  చంద్రబాబు, మోడీ మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయని తాను భావించడం లేదని సుజన అన్నారు. గోద్రా అల్లర్లు తదనంతర పరిణామాలు, నాడు చంద్రబాబు వైఖరి నేపథ్యంలో మోడీ ఆయనపై కక్ష కట్టారన్న ప్రచారాన్ని కూడా సుజన కొట్టిపారేశారు. ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు అలా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.

  వైసీపీ అవిశ్వాసంపై ఇలా

  వైసీపీ అవిశ్వాసంపై ఇలా

  అవిశ్వాసం పెడతానన్న వైసీపీపై సుజన స్పందిస్తూ.. అవిశ్వాసం వల్ల మోడీ ప్రభుత్వం పడిపోతుందా అని ప్రశ్నించారు. ఏపీకి 80 శాతం హామీలు అమలు చేశామన్న ఏపీ బీజేపీ నేతల వాదన సరికాదన్నారు. హోదా, విభజన అంశాలను పోరాడి సాధించుకుంటామన్నారు. నిరసన తెలిపేందుకే రాజీనామా చేశామన్నారు.

  చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదు

  చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదు

  చంద్రబాబుకు కేంద్రానికి భయపడాల్సిన అవసరం లేదని సుజన చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ ఎన్నికల అజెండాగా పెట్టుకుంటే తమకు సంబంధం లేదన్నారు. వైసీపీ అవిశ్వాసం ఓ ఎత్తుగడ అన్నారు. తాము విభజన హామీలకు నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. హామీల విషయంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు.

  చంద్రబాబు ఎప్పుడో మాట్లాడారు

  చంద్రబాబు ఎప్పుడో మాట్లాడారు

  కేంద్రం నుంచి నిధులు ఏమాత్రం రాలేదని తాము అనడం లేదని సుజన అన్నారు. పోలవరం, అమరావతికి కొంత నిధులు వచ్చాయని, హోదా పేరుతో వచ్చే ప్రయోజనాలు ఇవ్వాలని తాము అడిగామన్నారు. థర్డ్ ఫ్రంట్ గురించి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, కానీ చంద్రబాబు ఎప్పుడో మాట్లాడారన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Telugudesam Party leaders Sujana Chowdary and Buddha Venkanna on Bharatiya Janata Party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి